30 రోజుల్లో హిందీ నేర్చుకోవడంపై టి-సాట్ ప్రత్యేక లెసన్స్

విద్యార్థినీ, విద్యార్థుల కోసం పలు భాషలపై ప్రత్యేక డిజిటల్ పాఠాలు ప్రసారం చేసిన టి-సాట్ నెట్​వర్క్​ హిందీ భాషపైనా ప్రత్యేక డిజిటల్ పాఠ్యాంశాలు ప్రసారం చేసేందుకు షెడ్యూలు ఖరారు చేసింది.

Update: 2025-01-09 16:45 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : విద్యార్థినీ, విద్యార్థుల కోసం పలు భాషలపై ప్రత్యేక డిజిటల్ పాఠాలు ప్రసారం చేసిన టి-సాట్ నెట్​వర్క్​ హిందీ భాషపైనా ప్రత్యేక డిజిటల్ పాఠ్యాంశాలు ప్రసారం చేసేందుకు షెడ్యూలు ఖరారు చేసింది. అరగంట నిడివిగల పాఠ్యాంశాలు 30 రోజులు, అనుభవం కలిగిన ఫ్యాకల్టీ బోధించిన లెసన్స్ ప్రసారం కానున్నాయి. పాఠ్యాంశాలకు సంబంధించిన ప్రసారాల వివరాలను సీఈవో బోదనపల్లి వేణుగోపాల్ రెడ్డి గురువారం ఒక ప్రకటనలో వివరించారు. తెలంగాణాలోని విద్యార్థినీ విద్యార్థులు హిందీ మాట్లాడటంలో ప్రావీణ్యం కల్పించేందుకు టి-సాట్ ప్రత్యేక డిజిటల్ పాఠ్యాంశాలు సిద్ధం చేసిందని సీఈవో తెలిపారు. అనుభవం కలిగిన అధ్యాపకులచే బోధించబడిన పాఠ్యాంశాలను ప్రతి రోజూ అరగంట పాటు నిపుణ ఛానల్ లో మధ్యాహ్నాం 1.30 గంటలకు, విద్య ఛానల్ లో సాయంత్రం 6.30 గంటలకు, అలాగే జనవరి 11 నుండి ఫిబ్రవరి 13వ తేదీ వరకు శుక్రవారాలు మినహా ప్రసారం చేయనున్నట్లు తెలిపారు.

డిజిటల్ పాఠ్యాంశాలు టి-సాట్ యూట్యూబ్ తో పాటు, యాప్ లోనూ అందుబాటులో ఉంటాయని, విద్యార్థులు పాఠ్యాంశాలను సక్రమంగా వినియోగించుకునే విధంగా వారి తల్లిదండ్రులు ప్రోత్సహించాలని సీఈవో వేణుగోపాల్ రెడ్డి కోరారు. ప్రపంచ హిందీ దినోత్సవాన్ని పురస్కరించుకుని, నెల రోజుల పాటు హిందీ ప్రసారాల సందర్భంగా తొలి రోజు జనవరి 10వ తేదీ శుక్రవారం ఉదయం 11 నుండి 12 గంటల వరకు గంట పాటు ప్రత్యేక లైవ్ ప్రసారం ఉంటుందని తెలిపారు. తెలంగాణ యూనివర్సిటీ హిందీ విభాగం హెచ్.ఒ.డి పార్వతి, హిందీ సీనియర్ ఉపాధ్యాయుడు మతీన్ అహ్మద్ ఈ ప్రత్యేక ప్రసార కార్యక్రమంలో పాల్గొని హిందీ భాష నేర్చుకోవడంలో తలెత్తే సమస్యలకు సలహాలు ఇస్తారని తెలిపారు. విద్యార్థులు వారి తల్లిదండ్రలు, హిందీ భాష నేర్చుకోవాలనుకునే వారు 040 – 23540326,726 టోల్ ఫ్రీ నెం.1800 425 4039 లకు కాల్ చేయాలని సూచించారు.

Tags:    

Similar News