Seethakka : నాలుగేళ్ల చిన్నారిపై లైంగిక దాడి.. బాధిత కుటుంబానికి సీతక్క భరోసా
హైదరాబాద్‌లోని బౌరంపేటలో ఇటీవల నాలుగేళ్ల చిన్నారిపై లైంగిక దాడి ఘటన కలకలం సృష్టించిన విషయం తెలిసిందే.
దిశ, డైనమిక్ బ్యూరో: Hyderabad హైదరాబాద్‌లోని బౌరంపేటలో ఇటీవల నాలుగేళ్ల చిన్నారిపై లైంగిక దాడి ఘటన కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. లైంగిక దాడికి గురైన చిన్నారి హైదర్‌నగర్‌లోని రెయిన్బో ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. శనివారం చిన్నారిని పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి మహిళా శిశు సంక్షేమ శాఖల మంత్రి సీతక్క Seethakka, మహిళా అభివృద్ధి సహకార కార్పొరేషన్ చైర్ పర్సన్ బండ్లు శోభారాణి, మహిళా శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్ కాంతి వెస్లీతో కలిసి చిన్నారిని పరామర్శించారు. చిన్నారి కుటుంబానికి భరోసా ఇచ్చారు. అనంతరం సీతక్క మీడియాతో మాట్లాడుతూ.. ఆడపిల్లలపై కిరాతకులుగా మారి sexually abused దాడులు చేసే వారు ఎక్కువయ్యారని మండిపడ్డారు. చిన్నారి ఆరోగ్య పరిస్థితిని, అందుతున్న వైద్యాన్ని డాక్టర్ల నుంచి అడిగి తెలుసుకున్నాని సీతక్క తెలిపారు.
చిన్నారి వైద్యానికి ప్రభుత్వం అన్ని రకాలుగా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఆమె పూర్తిగా కోలుకున్న తర్వాతే డిశ్చార్జ్ చేయాలని డాక్టర్లకు సూచించానని చెప్పారు. బాధిత కుటుంబానికి తక్షణ సాయం అందించామని అన్నారు. ఈ ఘాతుకానికి పాల్పడిన నిందితుడికి కఠిన శిక్ష పడేలా కృషి చేస్తామని వెల్లడించారు. కాగా, Bowrampet బౌరంపేట బస్తీలో ఇటీవల నాలుగేళ్ల బాలిక ఇంట్లో ఎవరూ లేని సమయంలో చిన్నారిపై డ్రైవర్ యోగి అనే వ్యక్తి అఘాయిత్యానికి ఒడిగట్టాడు. చిన్నారి అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో తల్లిదండ్రులు ఆస్పత్రికి తరలించారు. ఈ క్రమంలోనే విషయం బయటకు రావడంతో పోలీసులు రంగంలోకి దిగారు. నిందితుడు మోగిని పోక్సో చట్టం కింద అరెస్ట్ చేసి చర్లపల్లి జైలుకు తరలించారు.