HYD : 10 రోజుల్లో డ్రంక్ అండ్ డ్రైవ్‌లో ఎంత మంది పట్టుబడ్డారో తెలుసా..?

మద్యం తాగి వాహనాలు నడపొద్దని ట్రాఫిక్ పోలీసులు ఎన్ని సూచనలు చేసినా స్పెషల్ అవేర్‌నెస్ ప్రోగ్రామ్‌లు చేపట్టినా.. మద్యం ప్రియుల తీరు మారడం లేదు.

Update: 2024-07-11 14:22 GMT

దిశ, వెబ్‌డెస్క్: మద్యం తాగి వాహనాలు నడపొద్దని ట్రాఫిక్ పోలీసులు ఎన్ని సూచనలు చేసినా స్పెషల్ అవేర్‌నెస్ ప్రోగ్రామ్‌లు చేపట్టినా.. మద్యం ప్రియుల తీరు మారడం లేదు. తాజాగా, హైదరాబాద్ పరిధిలో ట్రాఫిక్ పోలీసులు స్పెషల్ డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టారు. జులై 1-10 వరకు ట్రాఫిక్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టారు. 1,614 మంది మద్యం సేవించి వాహనాలు నడుపుతున్నట్లు పోలీసులు గుర్తించారు. 992 మంది వాహనదారులపై ట్రాఫిక్ పోలీసులు ఛార్జ్ షీట్లు నమోదు చేశారు. డ్రంక్ డ్రైవ్‌లో పట్టుబడిన 55 మందికి కోర్టు జైలు శిక్ష విధించింది. 8 మంది డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేసింది. అత్యధికంగా 1,346 ద్విచక్రవాహనదారులపై కేసు నమోదు అయింది.   


Similar News