HYD : రీల్ కోసం డేంజర్ స్టంట్.. ఏకంగా బస్సు కింద పడుకుని మరి..

రీల్స్ కోసం యువత చేస్తున్న స్టంట్స్ తీవ్ర ఆందోళన రేపుతున్నాయి.

Update: 2024-06-21 11:13 GMT

దిశ, వెబ్‌డెస్క్: రీల్స్ కోసం యువత చేస్తున్న స్టంట్స్ తీవ్ర ఆందోళన రేపుతున్నాయి. ఒక్కోసారి రీల్స్ పిచ్చి ప్రాణాల మీదకు తెస్తున్నా.. కొంత మంది తీరు మారడం లేదు. ఇటీవల మహారాష్ట్రలో ఓ యువతి రీల్స్ కోసం ఏకంగా పురాతన కట్టడంపైనుంచి వేలాడుతూ ప్రమాదకరంగా రీల్స్ చేసిన విషయం తెలిసిందే. సేమ్ ఇలాగే కొండ చివరన ఓ యువతి రీల్స్ చేస్తూ కారు ఎక్సలేటర్ తొక్కడంతో ప్రాణాలు కోల్పోయింది. తాజాగా, హైదరాబాద్‌ యూసుఫ్ గూడ ప్రధాన రహదారి వద్ద నడుస్తున్న బస్సు ముందు అకస్మాత్తుగా బ్లాక్ టీషర్ట్, బ్లాక్ ప్యాంట్ ధరించిన యువకుడు పడుకోవడం సంచలనం రేపింది. ఒక్క సారిగా బస్సు ముందుకెళ్లిన యువకుడు ప్రమాదకంగా బస్సు ముందు పడుకున్నాడు. బస్సు డ్రైవర్ అలానే వెళ్లనివ్వడంతో తాపీగా లేచి వెళ్లిపోయాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కాగా.. యువకుడిని పట్టుకుని కఠినంగా శిక్షించాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. కేవలం వ్యూస్ కోసం చేస్తున్న ఈ ప్రయత్నాలు విస్మయానికి గురి చేస్తుండగా.. యువతకు కౌన్సిలింగ్ ఇవ్వాలని పలువురు కోరుతున్నారు.



Similar News