భారీగా తగ్గిన టమాట ధర.. కేజీ ఎంత అంటే?

టమాట ధర ఎంత పెరిగిందో మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సామాన్యులకు అందని ద్రాక్షలా మిగిలిపోయింది. కాగా కొన్ని రోజుల నుంచి భారీగా పెరిగిన ధర నేడు కాస్త తగ్గినట్లు తెలుస్తోంది. ఏపీ కర్ణాటక నుంచి

Update: 2023-08-09 03:25 GMT

దిశ, వెబ్‌డెస్క్ : టమాటాధర ఎంత పెరిగిందో మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సామాన్యులకు అందని ద్రాక్షలా మిగిలిపోయింది. కాగా కొన్ని రోజుల నుంచి భారీగా పెరిగిన ధర నేడు కాస్త తగ్గినట్లు తెలుస్తోంది. ఏపీ కర్ణాటక నుంచి టమాటా దిగుమతి పెరగడంతో, తెలంగాణాలో ధరలు దిగివస్తున్నాయి. రైతుబజార్లలో కేజీ టమాటా ధర రూ.65 నుంచి 100 పలుకుతుండగా, బయట హోల్ సేల్‌లో రూ.100కు రెండు కిలోలు అమ్ముతున్నారు.కానీ హైదరాబాద్‌లో కొంత మంది దళారులు మాత్రం టమాటా కేజీ రూ.150 పైగా అమ్ముతున్నారు. ఇక ఈ నెలాఖరు నాటికి కేజీ టమాట ధర రూ.50కి తగ్గే అవకాశాలు ఉన్నాయంటున్నారు వ్యాపారులు.


Similar News