విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఎల్లుండి స్కూళ్లు, కాలేజీలు బంద్.. ఎందుకంటే?

విద్యార్థులకు భారీ శుభవార్త

Update: 2024-07-02 03:28 GMT

దిశ, వెబ్‌డెస్క్: విద్యార్థులకు భారీ శుభవార్త. నీట్, నెట్ పరీక్షల లీకేజీపై సమగ్ర విచారణ జరపాలని ఎస్ఐఎఫ్, ఎఐఎస్ఎఫ్, పీడీఎస్‌యూ, పీడీఎస్ఓ, ఎన్ఎస్‌యూఐ విద్యార్థి సంఘాలు దేశవ్యాప్తంగా జులై 4 వ తేదీన స్కూళ్లు, కాలేజీల బంద్‌కు పిలుపునిచ్చాయి. ఎన్టీఎను రద్దు చేయాలని డిమాండ్ చేశాయి. అంతేకాకుండా కేంద్ర విద్యాశాఖమంత్రి రాజీనామా చేశాలని ఆగ్రహం ధర్నా చేస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ఐదేళ్లలో 65 పేపర్ లీకేజీ ఘటనలు జరుగుతూనే ఉన్నాయి.. కానీ ఇప్పటివరకు పట్టించుకునే నాదుడే లేడని విద్యా్ర్థి సంఘాలు వాపోయాయి. కాగా నీట్, నెట్ పరీక్షల లీకేజీపై పార్లమెంట్ లో మోడీ సమగ్ర విచారణ జరిపి, విద్యార్థులకు న్యాయం చేయాలని AISF, PDSU, PDSO, SFI, NSUI విద్యార్థి సంఘాలు కోరాయి. కేవలం నీట్, నెట్ కాదు.. కొన్నేళ్ల నుంచి అన్ని పరీక్షల పేపర్ లీకేజీలతో విద్యార్థులు, అభ్యర్థులు తీవ్రంగా నష్టపోతున్నారని విద్యార్థి సంఘాలు విద్యాశాఖపై మండిపడ్డారు. పరీక్షలు అనేవి వారి జీవితాలకు సంబంధించినవని, మీరు విద్యార్థుల జీవితాలతో ఆడుకోవద్దని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Similar News