High Court : ఓయూ సర్క్యులర్ పై హైకోర్టు స్టే

తమ పరిధిలో నిరసనలు, ధర్నాలకు అనుమతి నిషేధిస్తూ ఉస్మానియా యూనివర్సిటీ(Osmania University) సర్క్యులర్ జారీ చేసిన విషయం తెలిసిందే.

Update: 2025-03-20 15:30 GMT
High Court : ఓయూ సర్క్యులర్ పై హైకోర్టు స్టే
  • whatsapp icon

దిశ, వెబ్ డెస్క్ : తమ పరిధిలో నిరసనలు, ధర్నాలకు అనుమతి నిషేధిస్తూ ఉస్మానియా యూనివర్సిటీ(Osmania University) సర్క్యులర్ జారీ చేసిన విషయం తెలిసిందే. దీనిని పలు విద్యార్థి సంఘాలు, రాజకీయ పార్టీలు తీవ్రంగా వ్యతిరేకించాయి. ఓయూ జారీ చేసిన ఈ సర్క్యులర్ మీద హైకోర్ట్(High Court) స్టే విధించింది. ఓయూ పరిధిలో ధర్నాలు, నిరసనలు బ్యాన్ చేస్తూ ఓయూ అధికారులు ఈ నెల 13వ తేదిన ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వులు చట్ట విరుద్ధమని రఫీ అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై బుధవారం హైకోర్టులో జస్టిస్ బి.విజయ్ సేన్ రెడ్డి విచారణ చేపట్టారు. భావప్రకటనా స్వేచ్ఛకు ఈ సర్క్యులర్ విరుద్ధమని పిటిషనర్ తరపున న్యాయవాది తన వాదనలు వినిపించారు. అయితే ఉస్మానియాలో నిరసన కార్యక్రమాలను నిలిపివేస్తూ ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేదని స్టాండింగ్ కౌన్సిల్ తెలిపింది. ఇరువైపులా వాదనల అనంతరం.. ఈ వ్యవహారంపై వివరణ ఇస్తూ కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి, ఓయూ రిజిస్ట్రార్ కు ధర్మాసనం నోటీసులు జారీ చేస్తూ.. తదుపరి విచారణను ఏప్రిల్ 9కి వాయిదా వేసింది.

Tags:    

Similar News