వార్ రూం కేసు: సునీల్ కనుగోలుకు హైకోర్టు షాక్

కాంగ్రెస్ వార్ రూం కేసులో కాంగ్రెస్ వ్యూహకర్త సునీల్ కనుగోలు దాఖలు చేసిన పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది.

Update: 2023-01-03 05:42 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: కాంగ్రెస్ వార్ రూం కేసులో కాంగ్రెస్ వ్యూహకర్త సునీల్ కనుగోలు దాఖలు చేసిన పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. సీసీఎస్ నోటీసులపై స్టే ఇవ్వలేమని మంగళవారం హైకోర్టు స్పష్టం చేసింది. డిసెంబర్ 27న సునీల్ కనుగోలుకు సైబర్ క్రైమ్ పోలీసులు 41 సీఆర్పీసీ కింద నోటీసులు ఇచ్చారు. దీనిపై స్టే విధించాలని కోరుతూ సునీల్ హైకోర్టును ఆశ్రయించాడు. ఈ కేసులో ఇప్పటికే ఇరు వర్గాల వాదనలు ముగిసిన నేపథ్యంలో మంగళవారం హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఈ సందర్భంగా పోలీసుల నోటీసులపై స్టే ఇవ్వడం కుదరదన్న హైకోర్టు.. సునీల్ కనుగోలు పోలీసుల ఎదుట హాజరుకావాల్సిందేనని స్పష్టం చేసింది. జనవరి 8వ తేదిన సీసీఎస్ పోలీసుల ఎదుట హాజరుకావాలని, పోలీసుల విచారణకు సహకరించాలని ఆదేశించింది. ఈకేసులో సునీల్ కనుగోలు ఏ1గా ఉన్నాడని ప్రభుత్వం తరపు న్యాయవాది హైకోర్టులో వాదించారు. అయితే ప్రభుత్వంతో పాటు అధికార పార్టీ నేతలపై అసభ్యకర రీతిలో, రెచ్చగొట్టే విధంగా సోషల్ మీడియా పోస్టులు పెడుతున్నారని పోలీసులు ఆరోపించారు.

Also Read...

Dubbaka బీజేపీలో ముసలం! సీనియర్ల రహస్య సమావేశం? 

Tags:    

Similar News