HYDRA : హైడ్రాపై పిల్.. సీఎస్ కు హైకోర్టు నోటీసులు

హైడ్రా(Hydra) కమిషన్ పై రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేయడంపై హైకోర్టు(High Court)లో ప్రజాప్రయోజిత వాజ్యం(PIL) దాఖలైంది.

Update: 2024-10-25 13:33 GMT

దిశ, వెబ్ డెస్క్ : హైడ్రా(Hydra) కమిషన్ పై రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేయడంపై హైకోర్టు(High Court)లో ప్రజాప్రయోజిత వాజ్యం(PIL) దాఖలైంది. హైడ్రా ఆర్డినెన్స్ పై మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని మాజీ కార్పొరేటర్ మంచిరెడ్డి ప్రశాంత్ రెడ్డి హైకోర్టులో పిల్ వేశారు. దీనిపై నేడు విచారణ చేపట్టిన కోర్ట్.. మూడు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని తెలంగాణ సీఎస్(CS) కు, ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. హైడ్రాకు విస్తృత అధికారాలు కల్పిస్తూ సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్ కు ఇటీవల గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆమోదం తెలిపారు. అలాగే ఈ చట్టాన్ని రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో ఆమోదించేదుకు రంగం సిద్దమైంది. హైదరాబాద్ లోని జీహెచ్ఎంసీ పరిధిలోని చెరువులు, కుంటలు, నాలాలు, పార్కులు, తదితర ప్రభుత్వ స్థలాలు రక్షించడం.. భారీ వర్షాల సమయంలో, ప్రకృతి వైపరీత్యాల సమయంలో మిగతా శాఖలతో సమన్వయం చేసుకొని ప్రజలకు సహాయం చేయడం వంటి అంశాలతో ప్రభుత్వం హైడ్రాను తీసుకు వచ్చింది. హైడ్రా అధికారాలను ప్రశ్నిస్తూ పలువురు కోర్టుకు ఎక్కడంతో.. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ఆర్డినెన్స్ జారీ చేసి, కీలక అధికారాలు హైడ్రాకు కట్టబెట్టింది. కాగా హైడ్రా కోసం జారీ అయిన ఈ ఆర్డినెన్స్ పై ప్రస్తుతం హైకోర్టులో పిల్ దాఖలైంది.

Tags:    

Similar News

టైగర్స్ @ 42..