HIGH COURT: పట్నం నరేందర్ రెడ్డి ఏమైనా ఉగ్రవాదా..? అరెస్ట్ తీరును తప్పు పట్టిన హైకోర్టు

బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే(BRS Former MLA) పట్నం నరేందర్ రెడ్డి(Patnam Narender Reddy) ఏమైనా ఉగ్రవాదా, వాకింగ్ వెళ్లినప్పుడే ఎందుకు అరెస్ట్ చేయాల్సి వచ్చిందని హైకోర్టు(Telangana High COurt) ప్రశ్నించింది.

Update: 2024-11-20 14:51 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే(BRS Former MLA) పట్నం నరేందర్ రెడ్డి(Patnam Narender Reddy) ఏమైనా ఉగ్రవాదా, వాకింగ్ వెళ్లినప్పుడే ఎందుకు అరెస్ట్ చేయాల్సి వచ్చిందని హైకోర్టు(Telangana High COurt) ప్రశ్నించింది. లగచర్ల ఘటన(Lagacharla Incident)లో పట్నం నరేందర్ రెడ్డి ని అరెస్ట్ చేసిన తీరును హైకోర్టు తప్పుపట్టింది. లగచర్ల ఘటనలో అరెస్ట్ అయిన బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి వేసిన క్వాష్ పిటిషన్‌పై బుధవారం హైకోర్టులో విచారణ జరిగింది. నరేందర్ రెడ్డి తరపున గండ్ర మోహన్ రావు(Gandra Mohan Rao) వాదనలు వినిపించారు. ఇరువురి వాదనలు ముగిసిన అనంతరం తీర్పును హైకోర్టు రిజర్వ్(Reserve) చేసింది. అరెస్టు సమయంలో పోలీసులు కనీస నిబంధనలు పాటించలేదని పిటిషనర్ తరపు న్యాయవాది గండ్ర మోహన్ రావు తెలిపారు.

హత్యాయత్నం కేస్ తప్ప మిగిలిన సెక్షన్‌లన్నీ ఐదు సంవత్సరాలలోపు శిక్ష పడేవే అని తెలిపారు. ఘటన జరిగిన రోజు సురేష్‌(Suresh) ‌తో పట్నం నరేందర్ ఎన్ని కాల్స్ మాట్లాడారని హైకోర్ట్ ప్రశ్నించింది. 71 డేస్‌లో 84 కాల్స్ ఉన్నందుకు అరెస్ట్ చేయడం సరికాదని న్యాయవాది తెలిపారు. అరెస్టు విషయాన్ని కనీసం కుటుంబసభ్యులకు కూడా చెప్పలేదన్నారు. సుప్రీంకోర్టు తీర్పులను కింది కోర్ట్ కనీసం పరిగణలోకి తీసుకోలేదని.. అరెస్ట్ గ్రౌండ్స్‌ను చూడకుండానే పట్నం నరేందర్ రెడ్డికి రిమాండ్ విధించారని తెలిపారు. పట్నం నరేందర్ రెడ్డిది అక్రమ అరెస్ట్ అని న్యాయవాది వాదించారు. ఎక్కడ కూడా పోలీసులు లీగల్ ప్రొసీడింగ్స్ ఫాలో కాలేదన్నారు. ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా మాజీ ఎమ్మెల్యేను అరెస్ట్ చేశారన్నారు.

11వ తేదీ సంఘటన జరిగినప్పుడు నరేందర్ రెడ్డి అక్కడ లేరని.. సురేష్ అనే నిందితుడి కాల్ డేటా ఆధారంగా అరెస్ట్ చేశామని పోలీసులు చెబుతున్నారన్నారు. 11వ తేదీ కేవలం ఒకే ఒక సారి సురేష్‌తో నరేందర్ రెడ్డి ఫోన్‌లో మాట్లాడినట్లు చెప్పారు. సుప్రీం కోర్టు తీర్పులను ఉల్లంఘించారని పిటిషనర్ తరపు న్యాయవాది గండ్ర మోహన్ రావు వాదనలు వినిపించారు. లగచర్ల ఘటనలో ప్రభుత్వాన్ని అస్థిర పరించేందుకు కుట్ర చేశారని తెలిపారు. కలెక్టర్ మీద, అధికారుల మీద దాడులు చేయించారని.. అన్నింటికీ ప్రధాన సూత్రధారి పట్నం నరేందర్ రెడ్డి అని వాదించారు. నరేందర్ రెడ్డికి సంబంధించి ఎలాంటి ఆధారాలు ఉన్నాయని హైకోర్టు ప్రశ్నించింది. తన అనుచరులతో కలిసి స్కెచ్ వేశారని కోర్టుకు పీపీ తెలియజేశారు. ఎవరు అనుచరులు.. అతని హోదా ఏంటి అని ధర్మాసనం మరో ప్రశ్న వేయగా.. సురేష్ అనే వ్యక్తి పట్నం నరేందర్ రెడ్డి ప్రధాన అనుచరుడు అని తెలిపారు. సంఘటన జరిగిన రోజు సురేష్ ... నరేందర్ కాల్స్ మాట్లాడుకున్నారని చెప్పారు. అరెస్ట్ సందర్బంగా ఎలాంటి నియమాలు పాటించారని పీపీని హైకోర్టు అడిగింది.

Tags:    

Similar News

టైగర్స్ @ 42..