High Court: ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్‌పై విచారణ మరోసారి వాయిదా

పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని దాఖలైన పిటీషన్ పై విచారణ మరోసారి వాయిదా పడింది.

Update: 2024-11-06 13:28 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని దాఖలైన పిటీషన్ పై విచారణ మరోసారి వాయిదా పడింది. ఈ కేసు విచారణను రేపటికి వాయిదా వేస్తూ డివిజన్ బెంచ్ నిర్ణయం తీసుకుంది. ఎమ్మెల్యేల అనర్హత వేటు పిటీషన్(Disqualification Petition Of MLAs) లో హైకోర్టు(High Court) సింగిల్ బెంచ్(Single Bench) ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ అసెంబ్లీ కార్యదర్శి(Assembly Secretary) డివిజన్ బెంచ్(Divison Bench) లో అప్పీల్(Appeale) చేసిన విషయం తెలిసిందే. దీనిపై జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ జే. శ్రీనివాసరావుల ధర్మాసనం విచారణ చేపట్టింది. ఇప్పటికే ప్రభుత్వం తరుపు వాదనలు వినిపించిన ఏజీ సుదర్శన్ రెడ్డి బీఆర్ఎస్ ఎమ్మెల్యే పిటిషన్ ను కొట్టివేయాలని బెంచ్ ను కోరారు. ఈ కేసులో ఇప్పుడు పిటీషనర్ల తరుపు వాదనలు కొనసాగుతున్నాయి. ఇవాళ కూడా కోర్టు సమయం ముగియడంతో కేసును రేపటికి వాయిదా(Adjourned) వేస్తున్నట్లు హైకోర్టు ధర్మాసనం తెలిపింది. దీంతో ఈ కేసులో డివిజన్ బెంచ్ ఆధ్వర్యంలో రేపు మరోసారి విచారణ కొనసాగనుంది.

Tags:    

Similar News