Kalvakuntla Kavitha : ఎమ్మెల్సీ కవితకు హైబీపీ..లాయర్ లిక్వేస్ట్‌కు కోర్టు నిరాకరణ

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో తెలంగాణకు చెందిన ఎమ్మెల్సీ కవితను ఈడీ అధికారులు శుక్రవారం సాయంత్రం అరెస్టు చేశారు.

Update: 2024-03-16 12:11 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో తెలంగాణకు చెందిన ఎమ్మెల్సీ కవితను ఈడీ అధికారులు శుక్రవారం సాయంత్రం అరెస్టు చేశారు. రాత్రి ఆమెను విమానంలో ఢిల్లీకి తరలించిన ఈడీ అధికారులు కవితను ప్రత్యేక నివాసంలో ఉంచి ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం ఈ రోజు రౌస్ అవెన్యూ కోర్టులో ఆమెను హాజరు పరిచి.. విచారణ కోసం 10 రోజుల కస్టడీకి పర్మిషన్ ఇవ్వాలని ఈడీ కోర్టును కోరింది. కానీ కోర్టు కవితను 7 రోజుల రిమాండ్ కస్టడీకి అనుమతి ఇచ్చింది.

ఈ క్రమంలో కవితకు హై బీపీ వచ్చిందని గతంలో ఎప్పుడు ఇలా కాలేదని.. ఓ మహిళా ఆరోగ్యం దృష్టిలో పెట్టుకుని ఉపశమనం ఇచ్చేందుకు కవిత తరఫున న్యాయవాదులు విజ్ఙప్తి చేశారు. కానీ కోర్టు వారి వాదనలకు తిరస్కరించి.. 7 రోజుల ఈడీ కస్టడీకి కోర్టు అనుమతించింది. అలాగే రోజుల పాటు కస్టడీలో ఉన్న కవితకు అసవర్ణమైన మెడిసిన్, దుస్తులు, ఫుడ్ అందించవచ్చని లాయర్ కు కోర్టు తెలిపింది.

Tags:    

Similar News