తెలంగాణ తెగువకు చిరునామాగా నిలిచిన వీర వనిత చాకలి ఐలమ్మ: బండి సంజయ్

తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ జయంతిని పురస్కరించుకొని.. కరీంనగర్ ఎంపీ, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఆమెకు ఘన నివాళులర్పించారు.

Update: 2024-09-26 08:59 GMT

దిశ,వెబ్‌డెస్క్: తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ జయంతిని పురస్కరించుకొని.. కరీంనగర్ ఎంపీ, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఆమెకు ఘన నివాళులర్పించారు. నేడు(సెప్టెంబర్ 26) భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం జ్వలించిన నిప్పుకణిక ఐలమ్మ అని బండి సంజయ్ అన్నారు. చాకలి ఐలమ్మ 129వ జయంతి సందర్భంగా ఆమె విగ్రహానికి నివాళులర్పించిన అనంతరం.. తొలి భూ పోరాటానికి నాంది పలికిన వీరమాత.. తెలంగాణ తెగువకు చిరునామాగా నిలిచిన వీర వనిత అన్నారు. మహిళా లోకానికి స్ఫూర్తి ప్రదాత, సబ్బండ వర్గాల ఆత్మగౌరవ ప్రతీక చాకలి ఐలమ్మ అని కొనియాడారు. గడీలపై గళమెత్తి భూ పోరాటానికి నాంది పలికిన ఐలమ్మ బహుజన ఆత్మగౌరవానికి, మహిళా చైతన్యానికి ప్రతీక అని బండి సంజయ్ వ్యాఖ్యానించారు.


Similar News