ఫోన్ ట్యాపింగ్ కేసులో కొత్త ట్విస్ట్! హైదరాబాద్‌లోప్రభాకర్‌రావు..?

ఫోన్ టాపింగ్ కేసులో కీలక నిందితుడు, ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు హైదరాబాద్‌లో తిరుగుతున్నట్లు పోలీసు వర్గాలకు విశ్వనీయ సమాచారం అందింది.

Update: 2024-10-25 03:51 GMT

దిశ, సిటీక్రైం: ఫోన్ టాపింగ్ కేసులో కీలక నిందితుడు, ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు హైదరాబాద్‌లో తిరుగుతున్నట్లు పోలీసు వర్గాలకు విశ్వనీయ సమాచారం అందింది. కొంత మంది ఆయన కారులో తిరుగుతుండగా చూసినట్లు కూడా చర్చ జరుగుతోంది. ఈ ఏడాది మార్చి 13 తర్వాత ఫోన్ టాపింగ్‌ఫై కేసు నమోదు కాగానే అమెరికా వెళ్ళిపోయిన ప్రభాకర్ రావు కోసం పోలీసులు రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేసి అరెస్ట్ చేయడానికి ప్రయత్నించిన విషయం తెలిసిందే. తాజాగా ప్రభాకర్ రావు నగరానికి చేరుకున్నాడానే సమాచారం సంచలనం రేపుతుంది. రెడ్ కార్నర్ నోటీసు, లుక్ అవుట్ నోటీసు ఉన్న ప్రభాకర్ రావును విమానాశ్రయంలో ఎందుకు అరెస్ట్ చేయలేదనే ప్రశ్నలు తలేతున్నాయి. అయ్యితే ప్రభాకర్ రావు కోర్టును ఆశ్రయించి పోలీసు విచారణకు సహకరిస్తానని, అనారోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని అరెస్ట్ నుంచి మినహాయింపు కావాలని కోరినట్లు తెలుస్తోంది. 

ఇదిలా ఉంటే ఇటీవల మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పొలిటికల్ బాంబులు పేలతాయని చెప్పడం.. ఇలాంటి టైంలో ప్రభాకర్ రావు హైదరాబాద్ చేరుకోవడంతో.. ఈ రెండింటికి లింక్ ఉందనే అనుమానాలు తలెత్తుతున్నాయి. ఇక విచారణలో ప్రభాకర్ రావు నోరు విప్పితే గత ప్రభుత్వంలోని కీలక వ్యక్తులు అరెస్ట్ తప్పదని స్పష్టం అవుతుంది. కాగా.. పోలీసులు మాత్రం ప్రభాకర్ రావు హైదరాబాద్ లో ఉన్న విషయాన్ని అధికారికంగా ధ్రువీకరించడం లేదు. ఇక ఈ ఫోన్ టాప్పింగ్ కేసులో పోలీసు అధికారులు భుజంగరావు, వెంకన్న, రాధా కిషన్ రావు, ప్రణీత్ రావులు అరెస్ట్ అయిన విషయం తెలిసిందే.


Similar News