Hero Nani: రాజకీయ నాయకుల అర్థం లేని వ్యాఖ్యలపై అసహ్యం వేస్తోంది: నటుడు నాని సంచలన వ్యాఖ్యలు
మంత్రి కొండా సురేఖ (Minister Konda Surekha) చేసిన కామెంట్స్ తెలుగు సినిమా ఇండస్ట్రీలో సంచలనం సృష్టిస్తున్నాయి.
దిశ, వెబ్‌డెస్క్: మంత్రి కొండా సురేఖ (Minister Konda Surekha) చేసిన కామెంట్స్ తెలుగు సినిమా ఇండస్ట్రీలో సంచలనం సృష్టిస్తున్నాయి. హీరో నాగచైతన్య (Naga Chaithanya), సమంత (Samantha) విడాకులకు కారణం మాజీ మంత్రి కేటీఆరే (KTR) అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు ఇటు పొలిటికల్‌గా దుమారాన్ని రేపుతున్నాయి. అదేవిధంగా హీరో నాగార్జునకు చెందిన ఎన్-కన్వెన్షన్‌ను కూల్చివేయకూడదంటే సమంతను తన దగ్గరికి పంపాలంటూ కేటీఆర్ డిమాండ్ చేశారని కొండా సురేఖ మీడియా ముఖంగా ఆరోపించారు. ఈ క్రమంలో తెలుగు సినిమా ఇండస్ట్రీలోని ప్రముఖులు మంత్రి చేసిన నిరాధారమైన వ్యాఖ్యలపై ఓ రేంజ్‌లో మండి పడుతున్నారు.
ఈ మేరకు సోషల్ మీడియా (Social Media) వేదికగా హీరోయిన్ సమంత (Samantha), అక్కినేని ఫ్యామిలీపై మంత్రి కొండ సురేఖ చేసిన వ్యాఖ్యలు వెంటనే వెనక్కి తీసుకోవాలని పలువురు సినీ ప్రముఖులు డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు తాజాగా ఇదే వివాదంపై హీరో నాని (Hero Nani) తీవ్రంగా స్పందించారు. రాష్ట్రంలో రాజకీయ నేతల అర్థం లేని వ్యాఖ్యలను చూస్తే తనకు అసహ్యం వేస్తుందని ఫైర్ అయ్యారు. తమ ప్రజల పట్ల వారికి ఏ మాత్రం బాధ్యత లేకుండా అనవసర విషయాలను మీడియా ముందు ప్రస్తవిస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రభుత్వంలో ఓ గౌరవప్రదమైన స్థానంలో ఉన్న వ్యక్తి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం బాధకరమని అన్నారు. ఇలాంటి నిరాధారమైన ఆరోపణలు మంత్రి కొండా సురేఖకు ఏ మాత్రం ఆమోదయోగ్యం కాదని ఆక్షేపించారు. సమాజంపై చెడు ప్రభావాన్ని చూపే ఇలాంటి చర్యలను సినీ ఇండస్ట్రీలో ఉన్నవారే కాకుండా అందరూ ముక్తకంఠంతో ఖండించాలని హీరో నాని పిలుపునిచ్చారు.