డేంజర్ వెదర్..! వైరస్ వ్యాప్తికి అనుకూలం అంటున్న వైద్యులు

వారం రోజులుగా వాతావరణంలో నెలకొన్న మార్పులు కారణంగా అనేక రోగాలకు కారణమయ్యేలా కనిపిస్తున్నాయి.

Update: 2024-10-03 03:13 GMT

దిశ ప్రతినిధి, నిర్మల్: వారం రోజులుగా వాతావరణంలో నెలకొన్న మార్పులు కారణంగా అనేక రోగాలకు కారణమయ్యేలా కనిపిస్తున్నాయి. వాస్తవానికి అక్టోబర్ మొదటి వారంలో చలి పెరగాలి. కానీ, తీవ్రమైన ఎండలు కాస్తున్నాయి. అందుక ప్రధాన కారణం వాతావరణం‌లో వచ్చిన మార్పులనేనని నిపుణులు అంటున్నారు. తీవ్రమైన హ్యుమిడిటీ కారణంగా విపరీతమైన చెమటలు పడుతున్నాయి. దీంతో మనిషి శరీరం డీ హైడ్రేష‌న్ గురై తొందరగా అలసిపోతున్నాడు .

రోగాలకు హెచ్చు

ఇలాంటి వాతావరణం రోగాలకు ప్రధాన కారణం అవుతుందని వైద్యులు చెబుతున్నారు. వాతావరణంలో తేమ లేకపోవడం, పొడి ఎండలతో మానవ శరీరంలో ప్రతికూల జీవ ప్రక్రియ జరుగుతుందని అంటున్నారు. ఈ పరిణామంతో పలు రోగాలు సంక్రమించే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ప్రధానంగా తీవ్రమైన జ్వరాలు, చర్మ వ్యాధులు, శ్వాసకోస సంబంధి వ్యాధులు పెరుగుతాయని పేర్కొంటున్నారు. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు బయట ఎండ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. మధ్యాహ్నం వేళ తీవ్రమైన చెమటలు పట్టి శరీరమంతా ఏదో తెలియని ప్రతికూలతకు లోనవుతుంది.

వైరస్ వ్యాప్తికి వాతావరణమే అనుకూలం

ఇలాంటి వాతావరణం వైరస్ వ్యాప్తికి అత్యంత అనుకూలంగా ఉంటుంది. రకరకాల జ్వరాలు ప్రబలే అవకాశం లేకపోలేదు. శరీరంలో కలిగే మార్పులను ఎప్పటికప్పుడు గమనించి జాగ్రత్తపడితే మంచింది. చెమటలు ఎక్కువగా పట్టినట్లయితే బీపీ, షుగర్ ఎప్పటికప్పుడు చెక్ చేయించుకోవాలి. ఇలాంటి వాతావరణంలో ద్రవ పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి. - డాక్టర్ రనీత్ కుమార్, ప్రముఖ ఫిజీషియన్, నిర్మల్


Similar News