బాసరలో ఘనంగా ప్రారంభమైన నవరాత్రి ఉత్సవాలు.. మొదటి రోజు శైలపుత్రి అవతారంలో అమ్మవారు

శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి సన్నిధిలో గురువారం శ్రీ శారదీయ శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి.

Update: 2024-10-03 03:55 GMT

దిశ, బాసర: శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి సన్నిధిలో గురువారం శ్రీ శారదీయ శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాలలో భాగంగా మొదటి రోజు అమ్మవారు శైలపుత్రి అవతారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. ప్రాప్త కాల సమయంలో అమ్మవారి మహా రుద్రాభిషేకం నిర్వహించి ఆది గణనాథుని పూజలతో ఉత్సవాలకు అంకురార్పణ చేశారు ఆలయ వేద పండితులు. ఉత్సవాలలో బాసరను సందర్శించే భక్తులకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఈవో విజయ రామారావు తెలిపారు. కాగా మొదటి రోజు శైలపుత్రి అమ్మవారికి కట్టే పొంగలి నైవేద్యంగా వైదిక సభ్యులు సమర్పించారు.



Similar News