మహానుభావుల త్యాగఫలమే 'స్వాతంత్ర్యం' : హీరో బాలకృష్ణ

దిశ, తెలంగాణ బ్యూరో : దేశ ప్రజలు పీల్చుకుంటున్న స్వేచ్ఛా - Hero Balakrishna unveiled the national flag to celebrate the 75th Independence Day of India

Update: 2022-08-15 17:08 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : దేశ ప్రజలు పీల్చుకుంటున్న స్వేచ్ఛా వాయువులు ఎందరో మహానుభావుల త్యాగఫలమని సినీ హీరో, బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ మరియు రీసెర్చ్ ఇన్సిస్టిట్యూట్ చైర్మన్ బాలకృష్ణ అన్నారు. బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్, రీసెర్చి ఇన్సిస్టిట్యూట్‌లో సోమవారం 75 వ భారత స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని జాతీయ జెండానే ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహాత్మా గాంధీ, నేతాజీ, పింగళి వెంకయ్య, వావిలాల గోపాల కృష్ణ వంటి ఎందరో మహానుభావులు దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించడానికి విశేష కృషి చేశారన్నారు.


స్వాతంత్ర్య దినోత్సవం మనకు భిన్నత్వంలో ఏకత్వం చాటుతూ మనం అందరం ఒక్కటే అన్న భావన నింపుతోందంటూ మన స్వాతంత్ర్య సిద్ది కోసం పోరాడిన మహానుభావులందరినీ స్మరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. విద్య, వైద్యం, శాస్త్ర సాంకేతిక రంగాల్లో ఎంతో పురోగతి సాధించామన్నారు. దేశంలోనే కాదూ ప్రపంచ శాంతి కోసం నేడు భారత్ విశేష కృషి చేస్తోందని పేర్కొన్నారు. నానాటికీ పెచ్చరిల్లుతున్న అవినీతి పై ప్రతి ఒక్కరూ తమ తమ పరిధిలో రాజ్యాంగబద్దంగా, నీతి నిజాయితీలతో పోరాడాల్సిన అవసరం ఉందని పిలుపు నిచ్చారు. ఈ కార్యక్రమంలో జేఎస్‌ఆర్ ప్రసాద్, ఆర్‌వి ప్రభాకర రావు, టీఎస్ రావు, ఫణి కోటేశ్వర రావు, కల్పనా రఘునాథ్, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

'ఎట్ హోమ్'కు చివరి నిమిషంలో సీఎం దూరం 


Similar News