Revanth reddy: ఆమె చదువు బాధ్యత ప్రభుత్వానిదే.. గిరిజన బిడ్డకు సీఎం భరోసా

ఆ గిరిజన బిడ్డ కల నెరవేర్చే బాధ్యత ప్రజా ప్రభుత్వానిదేనని సీఎం రేవంత్(CM Revanth Reddy) రెడ్డి ట్వీట్(Tweet) చేశారు.

Update: 2024-10-29 11:12 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: ఆ గిరిజన బిడ్డ కల నెరవేర్చే బాధ్యత ప్రజా ప్రభుత్వానిదేనని సీఎం రేవంత్(CM Revanth Reddy) రెడ్డి ట్వీట్(Tweet) చేశారు. ప్రభుత్వ విద్యాలయాలలో చదువుకొని నీట్(NEET) లో సీటు సంపాదించిన ఓ గిరిజన బాలిక(Tribal Girl).. ఆర్థిక స్థోమత కారణంగా చదువు మధ్యలోనే ఆపివేయాల్సి వస్తున్నది. దీంతో ఆ తల్లిదండ్రులు దాతలు ఎవరైనా ముందుకు వచ్చి తమ బిడ్డ డాక్టర్(Doctot) అయ్యేందుకు సహకరించాలని కోరారు. దీనికి సంబంధించిన వార్తను ఓ నెటిజన్ ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. దీనిపై సీఎం రేవంత్ రెడ్డి స్పందిస్తూ.. డాక్టర్ కావాలని కోరుకుంటున్న ఆ బాలికకు భరోసా ఇస్తూ స్పెషల్ పోస్ట్ పెట్టారు. ఈ సందర్భంగా.. కుమురం భీం జిల్లా(Komuram Bhim District), జైనూరు మండలం(Jainur Mandal), జెండాగూడ(Jendaguda) గ్రామానికి చెందిన గిరిజన బాలిక, చదువుల తల్లి సాయిశ్రద్ధ(Sai Shradha) అంశం తన దృష్టికి వచ్చిందని తెలిపారు. డాక్టర్ కావాలన్న ఆ అమ్మాయి కల నెరవేర్చే బాధ్యత ప్రజా ప్రభుత్వం తీసుకుంటుందని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. 

Tags:    

Similar News