ఏపీ-తెలంగాణాలో భారీ వర్షాలు.. రెండు రాష్ట్రాల మధ్య రాకపోకలు బంద్

రెండు తెలుగు రాష్ట్రాలను భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి.

Update: 2024-09-01 09:58 GMT

దిశ, వెబ్ డెస్క్ : రెండు తెలుగు రాష్ట్రాలను భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. కుండపోతగా కురుస్తున్న వర్షాలతో పలు జాతీయ రహదారుల మీదికి భారీగా వరద చేరడం, కొన్ని చోట్ల వరద వలన రోడ్లు కొట్టుకు పోయి.. రెండు రాష్ట్రాల మధ్య వాహనాల రాకపోకలు ఆగిపోయాయి. ఏపీ-తెలంగాణ సరిహద్దులోని రామాపురం చిమిర్యాల వాగు ఉదృతంగా ప్రవహిస్తోంది. కోదాడ నుండి వరద నీరు భారీగా కిందికి ప్రవహించడం వలన, నల్ల బండగూడెం వద్ద జాతీయ రహదారిపైకి వరద నీరు చేరడంతో వాహనాలను ఎక్కడివక్కడ నిలిపేశారు అధికారులు. దీంతో రెండు రాష్ట్రాల సరిహద్దుల్లోని చెక్ పోస్టు వద్ద రెండు వైపులా కిలోమీటర్ల మేర వాహనాలు ఆగిపోయాయి. వరద నీరు తగ్గిన తర్వాతే వాహనాల రాకపోకలు పునరుద్దరిస్తామని అధికారులు తెలియజేశారు. మరో వైపు రెండు రాష్ట్రాల్లోని పలు రైల్వే స్టేషన్లలో పట్టాల మీదకి భారీగా వర్షపు నీరు చేరడంతో పదుల సంఖ్యలో రైళ్లు నిలిపోయాయి. 


Similar News