Viral Video: రీల్స్ కోసం ప్రమాదం అంచున పిల్లాడి ప్రాణాలు.. మహిళపై నెటిజన్లు ఫైర్

రీల్స్ కోసం ఓ మహిళ చేసిన దుస్సాహసానికి నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు.

Update: 2024-09-21 10:54 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: రీల్స్ కోసం ఓ మహిళ చేసిన దుస్సాహసానికి నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు. సోషల్ మీడియాలో ఫేమస్ అవ్వడం కోసం ఏకంగా పిల్లాడి ప్రాణాన్ని ఫణంగా పెట్టింది. బాలుడిని బావి అంచున పెట్టి రీల్స్ లో నటించింది. ట్విట్టర్ లో పోస్ట్ చేసిన ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. వీడియో ప్రకారం ఓ మహిళ తెరిచి ఉన్న బావి అంచున కూర్చొని ప్రమాదకరంగా రీల్స్ లో నటించింది. అయితే ఇందులో ఆమె కాలుకు ఓ చిన్న పిల్లాడ్ని వేలాడదీసి పాటకు లిప్ సింక్ ఇస్తూ కనిపించింది. ఆ బాలుడు బావి పైన ఆ మహిళ కాలును పట్టుకొని గాల్లో వేలాడుతూ ఉన్నాడు.

ఈ ప్రమాదకర స్టంట్ ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. దీంతో ఈ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు రీల్స్ కోసం పిల్లాడి ప్రాణాల్ని పణంగా పెట్టిన మహిళపై దుమ్మెత్తిపోస్తున్నారు. ఏ తల్లి కూడా ఇంత నిర్లక్ష్యంగా కన్నబిడ్డ ప్రాణాల్ని ప్రమాదపుటంచున పెట్టేలా వ్యవహరించదని, దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకొని ఆ మహిళపై చర్యలు తీసుకోవాలని కామెంట్లు పెడుతున్నారు. అయితే ఈ వీడియోలో ఉన్న వారి వివరాలు, ఆ బాలుడికి మహిళ ఏమవుతుంది అన్న విషయాలు తెలియరాలేదు.


Similar News