Tirumala Laddu: రోజాకు భార్గవికళ్యాణి స్ట్రాంగ్ వార్నింగ్

తిరుమల లడ్డూ వివాదంపై తెలంగాణ బీజేవైఎం నాయకురాలు భార్గవికళ్యాణి ఆగ్రహం వ్యక్తం చేశారు....

Update: 2024-09-21 13:27 GMT
Tirumala Laddu:  రోజాకు భార్గవికళ్యాణి స్ట్రాంగ్ వార్నింగ్
  • whatsapp icon

దిశ, వెబ్ డెస్క్: తిరుమల లడ్డూ వివాదం (Tirumala laddu controversy)పై తెలంగాణ బీజేవైఎం నాయకురాలు భార్గవికళ్యాణి (Telangana BJYM leader Bhargavikalyani) ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుమలలో ఫొటో షూట్ చేసిన రోజా ఎక్కడుందని ఆమె ప్రశ్నించారు. లడ్డూ వివాదంపై మాజీ మంత్రి రోజా (Former Minister Roja) ఎందుకు మాట్లాడడం లేదని నిలదీశారు. దేవుడి ప్రసాదం తినలేదా అని ప్రశ్నించారు. పవిత్ర లడ్డూలో బీఫ్, ఫిప్ ఆయిల్ కలుపుతారా అని మండిపడ్డారు. పశువులకైనా ఇంగితం ఉంటుందని,  వైసీపీ(YCP) వాళ్లకి అది కూడా లేదని విమర్శించారు. హిందూ కల్చర్‌ను నాశనం చేయడానికే వైసీపీ పుట్టిందని ధ్వజమెత్తారు. తిరుమలలాంటి పవిత్ర స్థలాన్ని భ్రష్టు పట్టించారని భార్గవి కల్యాణి మండిపడ్డారు. సనాతన ధర్మాన్ని (Hindu culture) సర్వ నాశనం చేయడానికి చాలా ఎత్తుగడలు వేస్తున్నారన్నారు. హిందువునే టీటీడీ చైర్మన్‌గా చేసి తిరుమలలో నికృష్టపు పనులు చేశారని మండిపడ్డారు. ఇటువంటి వాళ్లు మళ్లీ ఓట్ల అడగానికి వస్తే కొట్టండని ఆవేశపూరిత వ్యాఖ్యలు చేశారు. జగన్ లాంటి వ్యక్తులకు మళ్లీ రాజకీయాల్లోకి రాకుండా ఏపీ ప్రజలు బుద్ది చెప్పాలని భార్గవికళ్యాణి కోరారు. 

Tags:    

Similar News