Intermediate Board: ఇంటర్మీడియట్ బోర్డ్ కీలక నిర్ణయం.. ఇక నుంచి ఎన్‌సీఈఆర్‌టీ సిలబస్‌!

తెలంగాణలో ఇంటర్ విద్యను మరింత పటిష్టం చేసేందుకు ప్రభుత్వం కొత్త విద్యా విధానానికి శ్రీకారం చుట్టబోతోంది.

Update: 2024-09-21 10:50 GMT

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో ఇంటర్ విద్యను మరింత పటిష్టం చేసేందుకు ప్రభుత్వం కొత్త విద్యా విధానానికి శ్రీకారం చుట్టబోతోంది. రాబోయే 2025-26 విద్యా సంవత్సరం నుంచి ఇంటర్ సిలబస్‌‌ను పూర్తిగా మార్చేందుకు ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. స్టేట్‌ సిలబస్‌ (State Syllabus) స్థానంలో ఎన్‌సీఈఆర్‌టీ సిలబస్‌ (NCERT Syllabus)ను తీసుకొచ్చేందుకు ఇప్పటకే ఇంటర్‌ బోర్డు (Intermediate Board) నిర్ణయం తీసుకున్నట్లుగా సమాచారం. అయితే, సిలబస్‌ను పూర్తిగా మార్చినా పరీక్షలను ఎప్పటిలాగే నిర్వహించి.. ఎన్‌సీఈఆర్‌టీలో గణితం ఒక్కటే సబ్జెక్టుగా ఉంచేందుకు ప్లాన్ చేస్తున్నారు.

ముఖ్యంగా గణితాన్ని రెండు భాగాలుగా విభజించి 1ఏ, 1బీ, 2ఏ, 2బీలుగా ప్రవేశపెట్టనున్నారు. జేఈఈ (JEE), సీయూఈటీ (CUET), క్లాట్‌ లాంటి పరీక్షల్లో వచ్చే ప్రశ్నలు ఎక్కువగా ఎన్‌సీఈఆర్‌టీ సిలబస్‌ (NCERT Syllabus) ఆధారంగానే వస్తుండటంతో ఆ విషయాన్ని గుర్తించి మార్పులు చేయాలని ఇంటర్ బోర్డు ఈ నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది. కాగా, రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేటు కళాశాలలు ఎన్‌సీఈఆర్‌టీ సిలబస్‌ను ఇప్పటికే అందుబాటులోకి తీసుకొచ్చారు. దీంతో సర్కార్ రాష్ట్రంలోని ప్రభుత్వ కళాశాలల్లో కూడా అదే విధానాన్ని తీసుకొచ్చి విద్యార్థులను మెరుగుపరిచేందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది. 


Similar News