భారీగా హాష్ ఆయిల్, గంజాయి చాక్లెట్లు పట్టివేత.. నలుగురు సభ్యుల ముఠా అరెస్ట్

హైదరాబాద్ నగరంలో భారీగా హాష్ ఆయిల్, గంజాయి చాక్లెట్లను అధికారులు పట్టుకున్నారు.

Update: 2024-09-21 12:04 GMT

దిశ, డైనమిక్ బ్యూరో : హైదరాబాద్ నగరంలో భారీగా హాష్ ఆయిల్, గంజాయి చాక్లెట్లను అధికారులు పట్టుకున్నారు. రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో రెండు వేర్వేరు కేసుల్లో 2.5 లీటర్ల హాష్ ఆయిల్, 3.8 కిలోల గంజాయి చాక్లెట్లను అధికారులు సీజ్ చేశారు. ఎస్‌వోటి ఎల్‌బీ నగర్ జోన్ బృందం దాదాపు హాష్ అయిల్ ముఠాను పట్టుకోని దాదాపు 21 లక్షల విలువైన డ్రగ్‌ను సీజ్ చేశారు. ఎస్‌వోటీ మహేశ్వరం జోన్ బృందం, ఆదిబట్ల పోలీసుల సహకారంతో గంజాయి చాక్లెట్లు విక్రయించే వ్యక్తిని పట్టుకున్నారు.

హాష్ ఆయిల్ కేసులో నలుగురు సభ్యుల ముఠాను అదుపులోకి తీసుకున్నట్లు రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు శనివారం మీడియాకు వెల్లడించారు. వీరిపై పీడీ యాక్ట్ కేసులు నమోదు చేస్తున్నట్లు పేర్కొన్నారు. అదేవిధంగా గంజాయి చాక్లెట్ల కేసులో ఓ నిందితుడిని అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. హాష్ ఆయిల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైజాగ్ నుంచి తీసుకొస్తున్నది సీజ్ చేసినట్లు ప్రకటించారు. గంజాయి చాక్లెట్లు బీహార్ నుంచి తెచ్చినట్లు కమిషనర్ తెలిపారు. ఈ మధ్య గంజాయి చాక్లెట్లు పాపులర్ అవుతున్నాయని అన్నారు. దీనిపై ఇంకా తదుపరి విచారణ చేపడతామని కమిషనర్ వెల్లడించారు.


Similar News