కాసేపట్లో MLC కవిత విడుదల.. తిహార్ జైలు వద్ద దంచికొడుతున్న వర్షం (వీడియో)

ఢిల్లీలోని తిహార్ జైలు పరిసరాల్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. మంగళవారం సాయంత్రం అనూహ్యంగా వర్షం ప్రారంభమైంది.

Update: 2024-08-27 13:10 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఢిల్లీలోని తిహార్ జైలు పరిసరాల్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. మంగళవారం సాయంత్రం అనూహ్యంగా వర్షం ప్రారంభమైంది. ఎడతెరిపిలేకుండా దంచికొడుతోంది. దీంతో రోడ్లపైకి భారీగా వరదనీరు చేరి ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. మరోవైపు ఇవాళే ఢిల్లీ లిక్కర్ కుంభకోణం కేసులో అరెస్టై తిహార్ జైల్లో ఉన్న కవితకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఒకేసారి సీబీఐ, ఈడీ కేసుల్లో ఆమెకు బెయిల్ మంజూరు చేసింది. దాదాపు ఐదున్నర నెలల తర్వాత కవితకు ఉపశమనం లభించింది. సుప్రీంకోర్టు బెయిల్ ఉత్తర్వులతో ఆమె తిహార్ జైలు నుంచి మంగళవారం రాత్రి 8 గంటల తర్వాత బయటకు వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో వర్షం షురూ కావడం అక్కడే ఉన్న బీఆర్ఎస్ శ్రేణులను కలవరపాటుకు గురిచేస్తోంది.

Full View



Similar News