Rain alert: హైదరాబాద్ లో మరికాసేపట్లో భారీ వర్షం
గురువారం ఉదయం నుంచి హైదరాబాద్ మహానగర వ్యాప్తంగా దట్టమైన మేఘాలు కమ్ముకున్నాయి.
దిశ, వెబ్ డెస్క్: గురువారం ఉదయం నుంచి హైదరాబాద్ మహానగర వ్యాప్తంగా దట్టమైన మేఘాలు కమ్ముకున్నాయి. అయితే పొడి వాతావరణం కారణంగా ఎక్కడ కూడా వర్షం పడలేదు. సాయంత్రానికి వాతావరణం ఉక్కపోతగా మారిపోయింది. అలాగే నగర ఉత్తర భాగంలో వర్షపు మేఘాలు కమ్ముకున్నాయి. వీటి ప్రభావంతో మరికొద్ది సేపట్లో నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని.. హైదరాబాద్ వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది. ఉత్తర హైదరాబాద్ తో పాటు మిగిలిన ప్రాంతాల్లో కూడా రాత్రి 8 తర్వాత వర్షం మొదలవుతుందని.. దాదాపు రెండు గంటల పాటు ఈ వర్షం కొనసాగే అవకాశం ఉందని.. ఆ సమయంలో వాహనదారులు ఎవరూ బయటకు రావొద్దని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఇదిలా ఉంటే తెలంగాణ లోని రెండు జిల్లాలు ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. భద్రాద్రి జిల్లాలోని పెద్దవాగు ఉదృతంగా ప్రవహిస్తుంది. అలాగే ఈ రోజు రాత్రి నుంచి ఉదయం వరకు భారీ వర్షాలు కురుస్తాయని రెండు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు.