మరికొన్ని గంటల్లో హైదరాబాద్ కు కుండపోత వర్షం

హైదరాబాద్ నగరంలో మధ్యాహ్నం నుండి భారీ వర్షం కురుస్తోంది.

Update: 2024-08-16 13:49 GMT

దిశ, వెబ్ డెస్క్ : హైదరాబాద్ నగరంలో మధ్యాహ్నం నుండి భారీ వర్షం కురుస్తోంది. లోతట్టు ప్రాంతాలు జలమయం కాగా, ప్రజలు ట్రాఫిక్ ఇక్కట్లకు గురయ్యారు. సికింద్రాబాద్,బేగంపేట్, మారేడుపల్లి, కూకట్పల్లి, మూసాపేట్, కేపీహెచ్బీ, నిజాంపేట్, బాచుపల్లి, మేడ్చల్, కండ్లకోయ, మియాపూ, లింగంపల్లి, కొండాపూర్, మాదాపూర్, గచ్చిబౌలి, రాయదుర్గం, పంజాగుట్ట, అమీర్పేట్, జూబ్లీహిల్స్, కోఠి, లకడీకపూల్, లిబర్టీ, హిమాయత్ నగర్ తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కాగా మరి కొన్ని గంటల్లో నగరానికి మళ్ళీ కుండపోత వర్షం ఉందని ఐఎండీ హెచ్చరికలు జారీ చేసింది. దాదాపు నగరం మొత్తం భారీ వర్షం పడే అవకాశం ఉందని, అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటికి రావొద్దని సూచించింది. ఇప్పటికే జీహెచ్ఎంసీ అధికారులు, డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి. ఏదైనా అత్యవసర సహాయం అవసరం అయితే 040-21111111 నంబరుకు ఫోన్ చేయాలని జీహెచ్ఎంసీ అధికారులు తెలిపారు.    


Similar News