BRS: వాస్తవాలను ఎందుకు దాచిపెడుతున్నారు.. నేతల అరెస్ట్‌లపై హరీష్ రావు

Update: 2024-09-23 09:58 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: వాస్తవాలను ఎందుకు దాచిపెడుతున్నారో చెప్పాలని, బీఆర్ఎస్ పార్టీ నిజనిర్ధారణ కమిటీని ఎందుకు అడ్డుకుంటున్నారని మాజీమంత్రి, బీఆర్ఎస్ నేత హరీష్ రావు అన్నారు. గాంధీ ఆసుపత్రి పరిస్థితులను పరిశీలించేందుకు వెళ్లిన బీఆర్ఎస్ నేతలు మెతుకు ఆనంద్, మాగంటి గోపి, కల్వకుంట్ల సంజయ్ లను పోలీసులు అరెస్ట్ చేశారు. దీనిపై ట్విట్టర్ వేదికగా స్పందించిన ఆయన బీఆర్ఎస్ నేతల అరెస్ట్‌లను ఖండించారు. ఈ సందర్భంగా.. రాష్ట్రంలో ప్రభుత్వాస్పత్రుల్లో ఉన్న పరిస్థితులను తెలుసుకునేందుకు వెళ్లిన బీఆర్ఎస్ పార్టీ నిజ నిర్ధారణ కమిటీ సభ్యులను అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు.

వాస్తవాలను ఎందుకు దాచి పెడుతున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. అంతేగాక కమిటీని ఆసుపత్రి విజిట్ చేయకుండా ఎందుకు అడ్డుకుంటున్నారని హరీష్ రావు ఎక్స్ వేదికగా నిలదీశారు. కాగా రాష్ట్రంలో ప్రభుత్వ ఆసుపత్రుల పరిస్థితులను పరిశీలించేందుకు బీఆర్ఎస్ పార్టీ అధ్యయన కమిటీని నియమించింది. వీరు సోమవారం హైదరాబాద్ గాంధీ ఆసుపత్రిని సందర్శించేందుకు వెళ్లాలని నిర్ణయించారు. దీంతో కమిటీ అధ్యక్షుడుగా ఉన్న మాజీ డిప్యూటీ సీఎం డా. తాటికొండ రాజయ్యను, ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో పోలీసులు అరెస్ట్ చేయగా.. కమిటీ సభ్యులైన ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్, మాజీ ఎమ్మెల్యే డా. మెతుకు ఆనంద్ సహా హైదరాబాద్ పార్టీ నగర అధ్యక్షులు, ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ లను గాంథీ హాస్పిటల్ వద్ద పోలీసులు అడ్డుకొని అరెస్ట్ చేశారు.


Similar News