వనస్థలిపురంలో భారీ అగ్ని ప్రమాదం.. 40 మందిని..
హైదరాబాద్ వనస్థలిపురం పీఎస్ పరిధిలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది.
దిశ, వనస్థలిపురం : వనస్థలిపురం చింతలకుంటలోని సుబ్బయ్య గారి హోటల్‌లో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. షార్ట్ సర్క్యూట్‌తో హోటల్ రెండో అంతస్తులో మంటలు చెలరేగాయి. ప్రమాదంలో ఫర్నిచర్ అగ్నికి ఆహూతయ్యింది. మంటల తీవ్రతతో హోటల్‌లో గందరగోళ పరిస్థితి నెలకొంది. మూడో అంతస్తులో 40 మంది చిక్కుకుపోయారు. అగ్నిప్రమాద సమాచారం అందుకున్న అగ్నిమాపకదళ సిబ్బంది, పోలీసులు ఆపదలో చిక్కుకున్న వారిని రక్షించారు. అగ్నిప్రమాద సమయంలో వనస్థలిపురం పోలీసులు, హయత్‌నగర్ ఫైర్ సిబ్బంది స్పందించడంతోనే పెద్ద ప్రమాదం తప్పిందని స్థానికులు తెలిపారు.