తెలంగాణ ఎన్నికలు.. భారీగా పట్టుబడిన నగదు, మద్యం

ఎన్నికల నేపథ్యంలో పోలీసులు జరుపుతున్న తనిఖీల్లో

Update: 2023-10-21 16:16 GMT

దిశ, తెలంగాణ క్రైం బ్యూరో: ఎన్నికల నేపథ్యంలో పోలీసులు జరుపుతున్న తనిఖీల్లో కట్టలు కట్టలుగా కరెన్సీ పట్టుబడుతూనే ఉంది. లీటర్లకు లీటర్లు మద్యం దొరుకుతూనే ఉంది. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా పోలీసులు, ఇతర ఏజెన్సీలు సీజ్​ చేసిన నగదు 105కోట్ల 58 లక్షల రూపాయలు దాటింది. ఇక మద్యం విషయానికి వస్తే 13.59కోట్ల రూపాయల విలువ చేసే 72వేల లీటర్ల మద్యాన్ని అధికారులు సీజ్​ చేశారు. 15.24కోట్ల రూపాయల విలువ చేసే గంజాయి, ఇతర డ్రగ్స్​ను స్వాధీనం చేసుకున్నారు. బంగారం, వెండి, వజ్రాలు కలిపి 145కోట్ల రూపాయల విలువైన సొత్తును వేర్వేరు ప్రాంతాల్లో సీజ్​చేశారు.

24 గంటల్లో...

శుక్రవారం ఉదయం 9గంటల నుంచి శనివారం ఉదయం 9గంటల వరకు రాష్ట్రవ్యాప్తంగా వేర్వేరు చోట్ల 9.70కోట్ల నగదును సీజ్​ చేశారు. అదేవిధంగా వేర్వేరు చోట్ల తనిఖీల్లో కోటీ 35లక్షల విలువ చేసే 31,861 లీటర్ల మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. 72లక్షల విలువ చేసే గంజాయి, వీడ్​ఆయిల్​ను సీజ్​ చేశారు. అలాగే 3.82కోట్ల రూపాయల విలువ చేసే 3,162 కిలోల బంగారం, ఇతర విలువైన లోహాలను స్వాధీనం చేసుకున్నారు. 2.40కోట్ల రూపాయల విలువ చేసే బియ్యం, ఇతర పరికరాలను సీజ్ చేశారు.


Similar News