డబ్బులు వేయాలన్నా.. తీయాలన్నా 30 కిలో మీటర్లు వెళ్లాల్సిందే..!

పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్టుగా ఉంది ఆ మండల పరిస్థితి.

Update: 2024-05-30 04:23 GMT

దిశ, గాంధారి : పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్టుగా ఉంది ఆ మండల పరిస్థితి. ఎందుకంటే మేజర్ గ్రామపంచాయతీ అందులో 44 జీపీలు ఉన్న ఆ మండలానికి నేషనల్ ఆథరైజ్డ్ బ్యాంకు మండలంలో లేకపోవడం చాలా విడ్డూరంగా ఉంది. వివరాలలోకి వెళితే కామారెడ్డి జిల్లా గాంధారి మండల కేంద్రంలో ఈ మధ్య ఏటీఎం సెంటర్‌ను ప్రారంభించడం జరిగింది. రోజుకు దాదాపు లక్షల్లో టర్నోవర్ జరిగే మేజర్ గ్రామపంచాయతీ అయిన గాంధారి మండల కేంద్రంలో నేషనల్ ఆర్థరైజ్డ్ బ్యాంకు లేకపోవడం కేవలం సర్వీస్ పాయింట్ తోనే సేవలు కొనసాగించడం జరుగుతుంది. మండల కేంద్రంలో ఉన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకు లేదు కానీ కేవలం సర్వీస్ పాయింట్ ఈ మధ్య కొత్తగా ఏటీఎంలు పెట్టి అలా కాలం వెళ్లదీస్తున్నారు.

దాదాపు ఇక్కడ ఉన్న వారందరూ ఖాతాలు కామారెడ్డి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కామారెడ్డి బ్రాంచ్‌కి చెందినవిగా ఉంటాయి. డబ్బులు వేయాలన్న తీయాలన్నా తప్పనిసరిగా 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న కామారెడ్డికి వెళ్ళాక తప్పదు. నేషనల్ బ్యాంక్ కోసం చాలామంది నాయకులు బ్యాంకు పై స్థాయి ఉద్యోగులైన వారికి ఎన్నోసార్లు వినతిపత్రం సమర్పించినట్లు నాయకులు తెలిపారు. ఈ విషయమై రాజకీయ నాయకులకు దృష్టికి తీసుకెళ్లగా వారు ఇచ్చిన వివరణ ప్రకారం తాజా మాజీ సర్పంచ్ ముంబై సంజీవ్ యాదవ్ మాట్లాడుతూ కామారెడ్డి మరియు నిజాంబాద్ జిల్లాల స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అధికారుల దృష్టికి తీసుకెళ్లామని అలాగే గాంధారి మండల కేంద్రంలో బ్యాంకును ఏర్పాటు చేయాలని వినతిపత్రం కూడా సమర్పించామని తెలిపారు.

భాజపా నాయకులు మాజీ జెడ్పిటిసి తానాజీ రావు ఈ సందర్భంగా మాట్లాడుతూ హైదరాబాద్లోని కోఠిలో ఉన్న స్టేట్ బ్యాంక్ ప్రాంతీయ కార్యాలయానికి వెళ్లి అధికారులకు వినతిపత్రం కూడా సమర్పించడం జరిగిందని అయితే అప్పట్లో తీసుకున్న రుణాలు సరిగ్గా కట్టకపోవడం పట్ల జరిగిన జాప్యం వల్ల బ్యాంకులు రావడానికి సముఖంగా లేవని చెప్పారు. అయితే ఇప్పుడు మరలా వచ్చి ఎంక్వయిరీ చేస్తే అలాంటి సంఘటన పునరావృతం కాకపోతే తప్పనిసరిగా గాంధారిలో బ్యాంకు ఏర్పాటు చేయడం జరుగుతుందని తానాజీ రావు తెలిపారు. గ్రామస్తులు దాదాపు సగానికి పైగా మంది కామారెడ్డి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అకౌంట్లో డబ్బులు వేయడానికి తీయడానికి నిత్యం సగటున 10 మంది వెళ్లడం జరుగుతుంది. ఇకనైనా గాంధారి మండల కేంద్రంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను ఏర్పాటు చేయాలని గ్రామస్తులు కోరుకుంటున్నారు.


Similar News