ప్రజాభవన్ వద్ద జేఎల్ అభ్యర్థుల నిరసన.. డీఎస్సీతో పాటు ఆ ఫలితాలు విడుదల చేయాలని డిమాండ్

డీఎస్సీ తుది ఫలితాలతో పాటు జూనియర్ లెక్చరర్స్ (జేఎల్) నోటిఫికేషన్ తుది ఫలితాలు విడుదల చేయాలని జూనియర్ లెక్షరర్స్ అభ్యర్థులు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

Update: 2024-10-04 12:00 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: డీఎస్సీ తుది ఫలితాలతో పాటు జూనియర్ లెక్చరర్స్ (జేఎల్) నోటిఫికేషన్ తుది ఫలితాలు విడుదల చేయాలని జూనియర్ లెక్షరర్స్ అభ్యర్థులు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. హైదరాబాద్ బేగంపేటలోని మహాత్మ జ్యోతిరావు‌పూలే ప్రజాభవన్ ముందు శుక్రవారం జూనియర్ లెక్చరర్స్ అభ్యర్థులు నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. 2022లో టీజీపీఎస్సీ 1392 జూనియర్ లెక్చరర్స్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసిందని, 2023లో ఎగ్జామ్ నిర్వహించిందని తెలిపారు.

2024లో ఆగస్టులో సర్టిఫికెట్ వెరిఫికేషన్ పూర్తయినట్లు వివరించారు. అయినా ఇప్పటి వరకు ఫలితాలను విడుదల చేయలేదన్నారు. 56 రోజుల్లో డీఎస్సీ ఫలితాలు విడుదల చేశారు.. జేఎల్ నోటిఫికేషన్ వచ్చి 600 రోజులు దాటిన ఫలితాలు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. అక్టోబర్ 9న డీఎస్సీ ఫలితాలతో పాటు జూనియర్ లెక్చరర్స్ తుది ఫలితాలను విడుదల చేయాలని వారు ప్రభుత్వాన్ని కోరారు.


Similar News