Harish Rao: ఎక్కడికి తీసుకెళ్తున్నారో తెలియడం లేదు.. నా ఎడమ భుజం బాగా నొప్పిగా ఉంది

ఎమ్మెల్యేలు అరికెపూడి గాంధీ, కౌశిక్ రెడ్డి వ్యవహారంతో రాష్ట్ర రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. కౌశిక్ రెడ్డి ఇంటిపై దాడి చేసిన వారిని అరెస్ట్ చేయాలని గురువారం సైబరాబాద్ సీపీ కార్యాలయం వద్ద హరీష్ రావు సహా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ధర్నా చేశారు.

Update: 2024-09-12 15:17 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఎమ్మెల్యేలు అరికెపూడి గాంధీ, కౌశిక్ రెడ్డి(Kaushik Reddy) వ్యవహారంతో రాష్ట్ర రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. కౌశిక్ రెడ్డి ఇంటిపై దాడి చేసిన వారిని అరెస్ట్ చేయాలని గురువారం సైబరాబాద్ సీపీ(Cyberabad CP) కార్యాలయం వద్ద హరీష్ రావు సహా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ధర్నా చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు హరీష్ రావును అరెస్ట్ చేశారు. అనంతరం రెండు వాహనాల్లో శ్రీశైలం వైపునకు తీసుకెళ్తున్నారు. తాజాగా.. ఓ మీడియా ఛానల్ ప్రతినిధితో హరీష్ రావు(Harish Rao) మాట్లాడారు. గాంధీపై హత్యాయత్నం కేసు పెట్టాలని డిమాండ్ చేశారు. న్యాయం కోసం పోలీస్ స్టేషన్‌కు వెళ్తే తమను అరెస్ట్ చేశారు. ఇప్పుడు తమను ఎక్కడికి తీసుకెళ్తున్నారో తెలియడం లేదు. మేమేమైనా ఉగ్రవాదులమా? అని హరీష్ రావు పోలీసులను ప్రశ్నించారు.

ఒక మాజీ మంత్రినైనా తన పట్ల ఇలా వ్యవహరించడం సరికాదని అన్నారు. ‘నా ఎడమ భుజం బాగా నొప్పిగా ఉంది. పోలీసులు నా చేతిని బలంగా లాగడంతో నొప్పి పెరిగింది. దాడి చేసిన వారిపై హత్యాయత్నం కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశాం. 307 నమోదు చేస్తే స్టేషన్ బెయిల్ ఎలా ఇస్తారు. ఏసీపీ, సీఐని తక్షణమే సస్పెండ్ చేయాలి. రేవంత్ రెడ్డి పాలనలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా ఫెయిలైంది. రాష్ట్రంలో ఇప్పటివరకు 1800 అత్యాచారాలు, 2600 హత్యలు జరిగాయి. ప్రజలు, మహిళలు ఎవరికీ రక్షణ లేదు. ప్రశ్నించే వారి గొంతులు నొక్కుతున్నారు. ప్రస్తుతం మా వాహనం తలకొండపల్లివైపు వెళ్తున్నది’ అని హరీష్ రావు తెలిపారు.

Read More : ఏ1గా అరికెపూడి గాంధీ.. 11 సెక్షన్ కింద కేసు


Similar News