కోలుకున్నాక KCR మొదటగా వెళ్లేది అక్కడకే.. హరీష్ రావు క్లారిటీ

ఇచ్చిన హామీలను అమలు చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం కాలయాపన చేస్తోందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు విమర్శలు చేశారు.

Update: 2024-01-18 11:42 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఇచ్చిన హామీలను అమలు చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం కాలయాపన చేస్తోందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు విమర్శలు చేశారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. గతేడాది డిసెంబర్ 9వ తేదీనే రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని మాటిచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటివరకు రుణమాఫీ ప్రస్తావనే తీసుకురావడం లేదని అసహనం వ్యక్తం చేశారు. రైతుబంధు, నిరుద్యోగ భృతి, రూ.4 వేల పెన్షన్, ఉచిత విద్యుత్ ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో హామీలు ఇచ్చి కాలం వెళ్లదీస్తోందని మండిపడ్డారు.

రైతులకు భరోసా ఇచ్చి సాగు విస్తీర్ణం పెంచేలా చూడాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ హయాంలో ఐటీ మంత్రిగా పెట్టుబడుల కోసం కేటీఆర్‌ దావోస్‌కు వెళ్తే.. డబ్బులు దండగా అని మాట్లాడిన రేవంత్ రెడ్డి.. ఇప్పుడెందుకు వెళ్లారని ప్రశ్నించారు. అదానీ వెనుక ప్రధాని మోడీ ఉన్నారని స్వయంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ అన్నారని.. అలాంటి అదానీని రేవంత్ రెడ్డి ఎలా కౌగిలించుకున్నారని హరీష్ రావు ప్రశ్నించారు. కేసీఆర్ ఆరోగ్యం కుదుటపడుతోందని.. 15 రోజుల్లో గజ్వేల్‌కు వస్తారని హరీష్ రావు క్లారిటీ ఇచ్చారు.

Tags:    

Similar News