అసెంబ్లీలో గద్దర్ పాట పాడిన హరీష్ రావు (వీడియో)

అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాలు వాడీవేడిగా కొనసాగుతున్నాయి.

Update: 2024-02-17 07:43 GMT

దిశ, వెబ్‌డెస్క్: అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాలు వాడీవేడిగా కొనసాగుతున్నాయి. ఇరిగేషన్ శాఖపై కాంగ్రెస్ శాసనసభలో శ్వేత పత్రం విడుదల చేసింది. ఈ అంశంపై మాజీ మంత్రి హరీష్ రావు రియాక్ట్ అయ్యారు. సమైక్య రాష్ట్రంలో కాంగ్రెస్ పరిపాలనలో తెలంగాణ అనుభవించిన కరువు బాధలను, నీళ్ల గోసలను అంతులేని వివక్షను అడ్డులేని దోపిడిని చూసి ఆగ్రహించి పాట రాయని కవి లేడన్నారు. కాంగ్రెస్ పాలన మీద గద్దర్ రాసిన పాటను అసెంబ్లీలో స్వయంగా హరీష్ రావు పాడి వినిపించారు.

‘కాంగ్రెస్ పాలనలో రన్న మనకు కన్నీళ్లే మిగిలాయిరన్నో గోదావరి తల్లి గొల్లుమని ఏడ్చింది. కృష్ణమ్మ తల్లిరా కన్నీళ్లు రాల్చింది. సింగరేణి తల్లి సిన్నబోయినది.. 610 జీవో జీరో అయింది.’ అని కాంగ్రెస్ పాలనపై గద్దర్ రాసిన పాటను పాడారు. ఉత్తరాన గోదావరి ఉప్పొంగి ‘ఉరకనేమి దక్షిణాన కృష్ణమ్మ దర్జాగా పారనేమి నీళ్లు లేక నోళ్లు తెరిచెబీళ్లను చూడు మా పల్లెలన్నీ బోసిపోగ తల్లడిల్లుతున్న తలీ చూడు తెలంగాణ, చుక్క లేని నీళ్లు లేని దాన మా గోడు తెలంగాణ, బతుకు పాడైన దాన..’ అని అందెశ్రీ కాంగ్రెస్ పాలనపై పాట రాశారని హరీష్ రావు గుర్తు చేశారు.

Full View
Tags:    

Similar News