Harish Rao : బోధన లేదు.. భోజనం లేదు! ప్రభుత్వానికి హరీశ్ రావు డిమాండ్ ఇదే!

నాణ్యమైన భోజనం పెట్టడం లేదని, చదువు కూడా సరిగా చెప్పడం లేదని కామారెడ్డి జిల్లా బీబీపేట మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ పాఠశాల విద్యార్థినిలు ఆందోళన వ్యక్తం చేశారు.

Update: 2024-11-11 06:23 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: నాణ్యమైన భోజనం పెట్టడం లేదని, చదువు కూడా సరిగా చెప్పడం లేదని కామారెడ్డి జిల్లా బీబీపేట మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ పాఠశాల విద్యార్థినిలు ఆందోళన వ్యక్తం చేశారు. హెడ్‌మాస్టర్‌తో పాటు వంటమనిషి అటెండర్‌ను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ ఆదివారం ఐదు గంటల పాటు ధర్నా చేశారు. ఈ ఘటనపై మాజీ మంత్రి హరీశ్ రావు (Harish Rao) సోమవారం ఎక్స్ వేదికగా ప్రభుత్వంపై విమర్శలు చేశారు.

బోధన లేదు, భోజనం లేదంటూ.. (Kamareddy) కామారెడ్డి జిల్లా బీబీపేట కస్తూర్బా గాంధీ పాఠశాల (Kasturba Gandhi) విద్యార్థులు తల్లిదండ్రులతో కలిసి ఆందోళన చేస్తుంటే ప్రభుత్వం పట్టనట్లు వ్యవహరిస్తుండటం శోచనీయమని పేర్కొన్నారు. విద్యార్థుల ఫిర్యాదులు పరిశీలించి, వెంటనే వారి సమస్యకు పరిష్కారం చూపాలని, మెరుగైన బోధన, నాణ్యమైన భోజనం అందేలా చూడాలని హరీశ్ రావు డిమాండ్ చేశారు.

Tags:    

Similar News