Harish Rao: అది ప్రకృతి తెచ్చిన కరువు కాదు.. కాంగ్రెస్ తెచ్చిన కరువు: హరీశ్‌రావు సెన్సేషనల్ కామెంట్స్

రాష్ట్రంలో నీళ్లు లేక పంటలు ఎండుతున్నాయని, అది ప్రకృతి తెచ్చిన కరువు కాదు.. కాంగ్రెస్ (Congress) తెచ్చిన కరువని మాజీ మంత్రి హరీశ్‌రావు (Former Minister Harish Rao) సంచలన వ్యాఖ్యలు చేశారు.

Update: 2024-09-23 06:10 GMT

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో నీళ్లు లేక పంటలు ఎండుతున్నాయని, అది ప్రకృతి తెచ్చిన కరువు కాదు.. కాంగ్రెస్ (Congress) తెచ్చిన కరువని మాజీ మంత్రి హరీశ్‌రావు (Former Minister Harish Rao) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ ఆయన తెలంగాణ భవన్‌ (Telangana Bhavan)లో మీడియాతో మాట్లాడుతూ.. పక్కనే నాగార్జున సాగర్ (Nagarjuna Sagar) ప్రాజెక్ట్ నిండుకుండలా ఉన్నా రైతులకు పూర్తిగా సాగునీరు అందకపోవడం దారుణమని అన్నారు. ముఖ్యంగా ఖమ్మం జిల్లా (Khammam District)లో నీళ్లు లేక పంటలు ఎండుతున్నాయని ఆరోపించారు. జిల్లా నుంచి ముగ్గురు మంత్రులు ఉన్నా ఆ జిల్లాకు ఇలాంటి దుస్థితి రావడం దురదృష్టకరమని తెలిపారు. జిల్లాకు వచ్చే సాగర్ కాలువ (Sagar Canal)కు గండి పడి 22 రోజులు గడిచినా.. ఇప్పటి వరకు ఆ గండిని సరిగా పూడ్చకపోవడం ఏంటని ప్రశ్నించారు. పక్కా ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే పంటలు ఎండిపోతున్నాయని ఆయన ఆరోపించారు.

సాగునీరు ఇచ్చేందుకు చేతకాదా..

గతేడాది ప్రకృతి తెచ్చిన కరువైతే.. ఈ ఏడాది కాంగ్రెస్ (Congress) కరువును తీసుకొచ్చిందని ఎద్దేవా చేశారు. రైతులకు కనీసం సాగునీరు ఇచ్చేందుకు ప్రభుత్వానికి చేతకాదా అని ప్రశ్నించారు. ఓ వైపు నీళ్లు లేక పంటలు ఎండుతుంటే.. హైదరాబాద్ (Hyderabad) నగరంలో నిరుపేదల ఇళ్లను నిర్ధాక్షిణ్యంగా కూల్చివేస్తున్నారని మండిపడ్డారు. రైతులు కన్నీళ్లు పెట్టకుండా చూడాలనే సోయి ఉండాలి కాదా అని ప్రశ్నించారు. వరదల్లో నష్టపోయిన రైతులకు ఇప్పటి వరకు ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా నష్ట పరిహారం ఇవ్వలేదని ఆరోపించారు. సర్కార్ నిర్వాకం వల్లే సుమారు లక్ష ఎకరాల్లో పంటలు ఎండిపోయాయని ధ్వజమెత్తారు. వర్షాలతో పంట నష్టపోయిన రైతులతో పాటే.. సాగర్ ఆయకట్టులో నీరందక పంట ఎండిన పొలాలకు కూడా ప్రభుత్వం పరిహారం ఇవ్వాలని హరీశ్‌రావు (Harish Rao) డిమాండ్ చేశారు.   

Read More : KTR : నిజాలను ప్రభుత్వం ఎందుకు దాస్తున్నది : కేటీఆర్ ఆసక్తికర పోస్ట్


Similar News