Spot Admissions : సమ్మక్క సారక్క సెంట్రల్ ట్రైబల్ వర్సిటీలో స్పాట్ అడ్మిషన్లు

తెలంగాణలోని ములుగు జిల్లాలో సమ్మక్క సారక్క సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీలో స్పాట్ అడ్మిషన్ల ప్రక్రియ చేపట్టింది.

Update: 2024-09-23 07:25 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలోని ములుగు జిల్లాలో ఉన్న సమ్మక్క సారక్క సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీలో స్పాట్ అడ్మిషన్ల ప్రక్రియ చేపట్టింది. ఈ మేరకు 2024-25 విద్యా సంవత్సరానికి గాను స్పాట్ అడ్మిషన్స్‌పై తాజాగా కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఒక ప్రకటన విడుదల చేసింది.

బీఏ ప్రోగ్రామ్‌లో వర్శిటీలో ప్రవేశాల కోసం అడ్మిషన్ల నోటిఫికేషన్ ఇదివరకే విడుదలైన విషయం తెలిసిందే. నాలుగేళ్ల కాలపరిమితితో వీటిని ప్రవేశపెట్టారు. ఇందులో భాగంగా ఇంగ్లీష్ అనర్స్, ఎకానామిక్స్ అనర్స్‌లో వేకెంట్ సీట్ల భర్తీకి అక్టోబర్ 3 వరకు అవకాశం కల్పించింది. అర్హులైన అభ్యర్థులు స్పాట్ అడ్మిషన్ ప్రక్రియలో సంబంధిత సర్టిఫికేట్లతో రావాలని వర్సిటీ సూచించింది.


Similar News