Harish Rao: ముఖ్యమంత్రికి విద్యార్థుల బాధలు పట్టవా: మాజీ మంత్రి హరీష్‌రావు ట్వీట్

రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రెసిడెన్షిల్, ప్రభుత్వ పాఠశాలలపై సర్కార్ చిన్నచూపు చూస్తోందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి.

Update: 2024-08-30 03:21 GMT

దిశ, వెబ్‌బెస్క్: రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రెసిడెన్షిల్, ప్రభుత్వ పాఠశాలలపై సర్కార్ చిన్నచూపు చూస్తోందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. అపరిశుభ్రంగా ఉన్న పరిసరాలతో విద్యార్థులు నిత్యం ఎక్కడో ఒకచోట అస్వస్థతకు గురవుతోన్న వార్తలు ఈ మధ్య హల్‌చల్ చేస్తున్నాయి. మరికొందరు ఎలుకలు కొరికి ఆసుపత్రుల పాలైన ఘటనల చోటుచేసుకున్నాయి. ఇక ఉపాధ్యాయుల కోరతతో ఆదిలాబాద్ జిల్లాలో ఏకంగా 43 మూతపడ్డాయంటూ విపక్ష నాయకులు విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ క్రమంలోనే రాష్ట్రంలో విద్యా వ్యవస్థ పనితీరుపై మాజీ మంత్రి హరీష్‌రావు ట్విట్టర్ వేదికగా ఫైర్ అయ్యారు. ‘సారొస్తారా..! అని ఎదురుచూస్తున్న విద్యార్థులకు తీవ్ర నిరాశే మిగులుతున్నది. ఉపాధ్యాయులు లేక, విద్యా వాలంటీర్లను నియమించక ప్రభుత్వ పాఠశాలలు మూత పడుతున్నాయి. తరగతి గదుల్లో కూర్చుని పాఠాలు నేర్చుకోవాల్సిన పిల్లలు, బడికి దూరమవుతున్నారు. విద్యా శాఖను కూడా తానే నిర్వర్తిస్తున్న ముఖ్యమంత్రి సారుకు ఇవేవీ పట్టవు’ అంటూ ట్వీట్ చేశారు.

కాగా, గడిచిన 8 నెలల్లో 500 మంది గురుకుల విద్యార్థులు అస్వస్థతకు గురై ఆసుపత్రుల పాలు కాగా, 36 మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారని ఆయన అన్నారు. గురుకుల పాఠశాలల్లో నెలకొన్న దుస్థితికి విద్యాశాఖ మంత్రిగా రేవంత్‌రెడ్డి బాధ్యత తీసుకోవాలని అన్నారు. ఇప్పటికైనా ప్రతిపక్షాలపై ఫోకస్ పెట్టడం మాని గురుకుల విద్యార్థుల సంక్షేమానికి ప్రాధాన్యతనివ్వాలని హరీశ్‌రావు డిమాండ్ చేశారు. 


Similar News