Former Ministers: తెలంగాణలో ఎవరూ శుభకార్యం చేసుకోవద్దా?

కేటీఆర్‌(KTR)ను రాజకీయంగా ఎదుర్కొలేక కుట్ర చేస్తున్నారని కాంగ్రెస్ నేతలపై మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మండిపడ్డారు.

Update: 2024-10-27 13:19 GMT

దిశ, వెబ్‌డెస్క్: కేటీఆర్‌(KTR)ను రాజకీయంగా ఎదుర్కొలేక కుట్ర చేస్తున్నారని కాంగ్రెస్ నేతలపై మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మండిపడ్డారు. ఆదివారం ప్రశాంత్ రెడ్డి (Vemula Prashanth Reddy) తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. కేటీఆర్(KTR) బావమరిది సొంతంగా ఫామ్ హౌస్ కట్టుకుని గృహ ప్రవేశం చేశారు. అందులో తప్పేంటని ప్రశ్నించారు. జన్వాడలో ఏం దొరకలేదు. గచ్చిబౌలిలోని రాజ్ పాకాల ఇంట్లో తనిఖీలు చేస్తున్నారు. కేటీఆర్‌పైన కక్ష తీర్చుకునేందుకు కుటుంబ సభ్యలను బలి చేసే ప్రయత్నం చేస్తున్నారు. రాజ్ పాకాల ఇంట్లోకి లాయర్లను పంపించాలి. పోలీసులు ఆయనపై కేసు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. దీనిని వెనుక ప్రభుత్వ పెద్దలు ఉన్నారని ప్రశాంత్ రెడ్డి(Prashanth Reddy) అనుమానం వ్యక్తం చేశారు.

కేటీఆర్‌(KTR)పైన ప్రభుత్వం కక్షపూరితంగా ఉంది. అనంతరం మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి(Sabita Indra Reddy) మాట్లాడారు. తెలంగాణలో ఎవరూ శుభకార్యం చేసుకోవద్దా? అని ప్రభుత్వ పెద్దలను ప్రశ్నించారు. పోలీసు కుటుంబాలు రోడ్డెక్కితే కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్(Bandi Sanjay) స్పందించలేదు. రాజ్ పాకాల విషయంలో బండి సంజయ్ వీడియో రిలీజ్ చేశారని అసంతృప్తి వ్యక్తం చేశారు. అసలు సెర్చ్ వారెంట్ లేకుండా సోదాలు ఎట్లా చేస్తారని ప్రశ్నించారు. తెలంగాణలో పండుగలు వచ్చినప్పుడు దావత్‌లు చేసుకోవడం కామన్. ప్రభుత్వం కుట్ర చేయడం సరికాదని అన్నారు.

Tags:    

Similar News