ఈ బాలికలను చూస్తుంటే సంతోషంగా ఉంది..సీఎం రేవంత్ ట్వీట్ వైరల్!

ప్రజా ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఫ్రీ బస్ స్కీం గురించి మరోసారి సీఎం రేవంత్ రెడ్డి ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేశారు.

Update: 2024-06-14 08:47 GMT

దిశ,వెబ్‌డెస్క్: ప్రజా ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఫ్రీ బస్ స్కీం గురించి మరోసారి సీఎం రేవంత్ రెడ్డి ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేశారు. వివరాల్లోకి వెళితే..ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం తో బాలికలు పాఠశాలకు వెళ్తుండటం ఆనందాన్ని కలిగిస్తోందని సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ‘సిద్దిపేట జిల్లా మగ్దుం పూర్ పాఠశాలలో చదువుతున్న ఈ బాలికలు ఊరికి కి.మీ. దూరంలో ఉన్న స్కూల్‌కి రూపాయి ప్రయాణఖర్చు లేకుండా పాఠశాలకు వెళ్లగలుగుతున్నారు. ఉచిత ప్రయాణం వల్ల బస్సెక్కి స్కూలుకు వెళ్లగలుగుతున్నామని ఆధార్ కార్డులు చూపిస్తూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు’ అని సీఎం పేర్కొన్నారు. ప్రజెంట్ సోషల్ మీడియాలో ఈ బాలికల చేతిలో ఆధార్ కార్డులు పట్టుకుని ఉన్న ఫొటోలు వైరల్‌గా మారాయి.


Similar News

టైగర్స్ @ 42..