AP సీఎం చంద్రబాబుకు గుత్తా సుఖేందర్ రెడ్డి కృతజ్ఞతలు

తిరుమల(Tirumala)లో తెలంగాణ రాష్ట్ర ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీల సిఫార్సు లేఖలను అనుమతి ఇచ్చిన ఏపీ సీఎం చంద్రబాబు(Chandrababu) నాయుడు

Update: 2024-12-30 13:50 GMT

దిశ, వెబ్‌డెస్క్: తిరుమల(Tirumala)లో తెలంగాణ రాష్ట్ర ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీల సిఫార్సు లేఖలను అనుమతి ఇచ్చిన ఏపీ సీఎం చంద్రబాబు(Chandrababu) నాయుడు, తిరుమల తిరుపతి దేవస్థానం(TTD) చైర్మన్ బీర్ నాయుడు(BR Naidu)కు శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి(Gutta Sukender Reddy) ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలపై చంద్రబాబుతో చర్చించి, వారానికి నాలుగు సిఫార్సు లేఖలు అనుమతించేందుకు అంగీకరించినందుకు ఆయన హర్షం వ్యక్తం చేశారు. వారానికి రెండు బ్రేక్ దర్శనం, రెండు రూ.300 దర్శనానికి సంబంధించిన లేఖలు పరిగణనలోకి తీసుకోవడం శుభపరిణామంగా భావిస్తున్నట్లు ఆయన తెలిపారు.

Tags:    

Similar News