గురుకులాలకు కామన్ డైరెక్టరేట్ అవసరం : సీఎస్ కు గురుకుల జేఏసీ వినతి

గురుకులాల అడ్మినిస్ట్రేషన్ లో ఈజీగా నిర్ణయాలు తీసుకునేందుకు కామన్ డైరెక్టరేట్ ఏర్పాటు చేయాలని గురుకుల జేఏసీ సీఎస్ శాంతికుమారిని కోరారు.

Update: 2024-08-21 16:44 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : గురుకులాల అడ్మినిస్ట్రేషన్ లో ఈజీగా నిర్ణయాలు తీసుకునేందుకు కామన్ డైరెక్టరేట్ ఏర్పాటు చేయాలని గురుకుల జేఏసీ సీఎస్ శాంతికుమారిని కోరారు. ఈ మేరకు గురుకులాల్లోని వివిధ సమస్యలను ప్రస్తావిస్తూ బుధవారం ఆమెకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు మామిడి నారాయణ మాట్లాడుతూ... ప్రభుత్వ గురుకులాల సమయ పాలన మార్చాల్సిన అవసరం ఉన్నదన్నారు. ప్రస్తుతం ఉదయం 8 నుంచి మొదలవుతుందని, దీన్ని 9 నుంచి 4.30 కి ఛేంజ్ చేయాలన్నారు. లేకుంటే విద్యార్ధులకు ఇబ్బందులు తలెత్తుతున్నాయన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆరు వందల గురుకులాలు ప్రైవేట్ బిల్డింగ్ లో కొనసాగుతున్నాయని, అరకొర సౌకర్యాలతో నెట్టుకొస్తున్నామని వివరించారు. మెస్ చార్జీలు పెంచుతూ, ప్రభుత్వ గురుకులంలోని విద్యార్థులను సమీప డాక్టర్లు వారానికి రెండుసార్లు కచ్చితంగా పరీక్షించే విధంగా ఉత్తర్వులు ఇవ్వాలన్నారు. ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగానే తమకూ ఒకటో తేదినే జీతాలు చెల్లించాలన్నారు. అన్ని కేడర్లలో వంద శాతం ప్రమోషన్లకు అవకాశం ఇవ్వాలన్నారు. స్టాఫ్​ పెట్రన్ సమానంగా ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. హెచ్ఆర్ఏ యధావిధిగా అందజేయాలన్నారు. అన్ని గురుకులాల్లో ఆర్ట్, క్రాప్ట్, మ్యూజిక్ వాళ్లకు గ్రేడ్ 1, గ్రేడ్ 2 పోస్టులు క్రియేట్ చేయాలన్నారు. పే ప్రోటెక్షన్, సర్వీస్ ప్రోటెక్షన్ అమలు చేయాలన్నారు. డిప్యూటీ వార్డెన్ పోస్టులు మంజూరు చేసి, అన్ని సంఘాలను జాయింట్ స్టాఫ్​కౌన్సిల్ పరిధిలోకి తీసుకురావాలన్నారు.     


Similar News