కేజ్రీవాల్‌కు ఏమాత్రం నైతిక విలువల్లేవ్: కిషన్ రెడ్డి ఫైర్

ఏమాత్రం నైతిక విలువలు లేని వ్యక్తి అరవింద్ కేజ్రీవాల్ అని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఘాటుగా విమర్శించారు. ..

Update: 2024-09-22 16:43 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: ఏమాత్రం నైతిక విలువలు లేని వ్యక్తి అరవింద్ కేజ్రీవాల్ అని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఘాటుగా విమర్శించారు. కోట్ల రూపాయల మద్యం కుంభకోణంలో పట్టుబడి జైలుకు వెళ్లిన వ్యక్తి అంటూ ఫైరయ్యారు. ఆర్ఎస్ఎస్ సర్‌ సంఘచాలక్ మోహన్ భాగవత్‌కు అరవింద్ కేజ్రీవాల్ 5 ప్రశ్నలు సంధించడంపై కిషన్ రెడ్డి స్పందించారు. ప్రజలు,  వారి సంక్షేమంపై ఆలోచించని వ్యక్తి కేజ్రీవాల్ అని మండిపడ్డారు. ప్రజారోగ్యం విషయంలోనూ ప్రజలను దోచుకోవాలనుకునే వ్యక్తి కేజ్రీవాల్ అని ధ్వజమెత్తారు. తనను నమ్మి ఎన్నోసార్లు అధికారాన్ని అప్పగించినా.. వారి జీవితాల్లో సానుకూల మార్పులు తీసుకురానందుకు ఢిల్లీ ప్రజలకు కేజ్రీవాల్ క్షమాపణలు చెప్పాలని కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు.


Similar News