టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా గుర్రం చెన్నకేశవ రెడ్డి

మహబూబ్‌నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ ఉమ్మడి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రొగ్రెసివ్ రికగ్నైజ్డ్ టీచర్స్ యూనియన్ తెలంగాణ స్టేట్ సంఘం గుర్రం చెన్నకేశవ రెడ్డిని ప్రకటించింది.

Update: 2022-10-09 15:09 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: మహబూబ్‌నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ ఉమ్మడి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రొగ్రెసివ్ రికగ్నైజ్డ్ టీచర్స్ యూనియన్ తెలంగాణ స్టేట్ సంఘం గుర్రం చెన్నకేశవ రెడ్డిని ప్రకటించింది. ఆదివారం యూనియన్ కార్యాలయంలో 33 జిల్లాల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శుల సమావేశంలో మెజారిటీ సభ్యుల ఆమోదంతో చెన్నకేశవ రెడ్డిని అభ్యర్థిగా ప్రకటించారు. అనంతరం యూనియన్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పింగిలి శ్రీపాల్ రెడ్డి, బీరెల్లి కమలాకర్ రావు మాట్లాడుతూ.. చెన్న కేశవ రెడ్డి 2017-18 సంవత్సర కాలంలో పీఆర్టీయూటీఎస్ రాష్ట్ర సంఘం ప్రధాన కార్యదర్శిగా పని చేశారని తెలిపారు. అంతకుముందు 2011-17 దాకా ఉమ్మడి రంగారెడ్డి జిల్లా అధ్యక్షునిగా, టీటీజేఏసీ చైర్మన్‌గా పనిచేస్తూ తెలంగాణ ఉద్యమంలో చురకుగా పాల్గొన్నారని తెలిపారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీలు కాటేపల్లి జనార్ధన్ రెడ్డి, కూర రఘోత్తం రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్, మాజీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి ఎల్ నరసింహా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News