Group-2 Exam: ప్రశాంతంగా ముగిసిన గ్రూప్-2 పేపర్-1 పరీక్ష
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు(ఆదివారం) మార్నింగ్ నిర్వహించిన గ్రూప్-2 పేపర్-1 పరీక్ష(Paper-1) ప్రశాంతంగా ముగిసింది.
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు(ఆదివారం) మార్నింగ్ నిర్వహించిన గ్రూప్-2 పేపర్-1 పరీక్ష(Paper-1) ప్రశాంతంగా ముగిసింది. మొత్తం 783 గ్రూప్-2 పోస్టుల భర్తీకి డిసెంబర్ 15,16న పరీక్షలు నిర్వహించేందుకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్(TGPSC) అన్ని ఏర్పాట్లు చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 1,368 కేంద్రాల్లో ఈ పరీక్షలు నిర్వహించనున్నారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధించారు. కాగా గ్రూప్-2 పోస్టుల భర్తీకి టీజీపీఎస్సీ 2022 డిసెంబర్ 29న ప్రకటన జారీ చేయగా పలుమార్లు వాయిదా(Postpone) పడుతూ వచ్చింది. మొత్తం 5,51,943 మంది గ్రూప్-2 పోస్టులకు అప్లై చేసుకున్నారు. ఒక్కో పేపర్ 150 మార్కుల చొప్పున మొత్తం నాలుగు పేపర్లుగా గ్రూప్-2 ఎగ్జామ్ జరుగుతోంది. కాగా ఈ రోజు బేగంపేట(Begumpet)లోని ఓ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలకు టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశం(Burra Venkatesham) వెళ్లి అక్కడ పరీక్ష ఏర్పాట్లను పరీశిలించారు. అభ్యర్థులు ఎలాంటి ఆందోళన చెందకుండా ప్రశాంతంగా పరీక్ష రాయాలని, ఎలాంటి అసౌకర్యం లేకుండా ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. ఇదిలా ఉంటే పేపర్-1 పరీక్ష ప్రారంభానికి ముందు కొన్ని ఎగ్జామ్ సెంటర్ల దగ్గర అభ్యర్థులు ఆందళోన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. లగేజ్ కౌంటర్ల వద్ద సెల్ ఫోన్లు, బ్యాగులు భద్రపరచడానికి ఒక్కో అభ్యర్థి నుంచి రూ. 50 వసూలు చేస్తున్నారని ఆరోపించారు. ఈ ఘటనపై తాము టీజీపీఎస్సీ కి ఫిర్యాదు చేస్తామని తెలిపారు.