Group-1 exam: శభాష్ ఎస్ఐ సాబ్.. గ్రూప్-1 ఎగ్జామ్.. ఎస్ఐ ప్రయత్నానికి అంతా ప్రశంసలు

గ్రూప్-1 ఎగ్జామ్.. ఎస్ఐ ప్రయత్నానికి అంతా ప్రశంసలు కురిపించారు.

Update: 2024-10-21 12:03 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: తొలిరోజు గ్రూప్- 1 మెయిన్స్ ఎగ్జామ్ ప్రశాంతంగా ముగిసింది. నిమిషం నిబంధన కారణంగా అభ్యర్థులకు ఆలస్యం కాకూడదని కీసర ట్రాఫిక్ ఇన్ స్పెక్టర్ వెంకటయ్య చేసిన ముందుచూపు ఓ అభ్యర్థికి ఉపయోగపడింది. కీసర గీతాంజలి కాలేజీ వద్ద గ్రూప్-1 ఎగ్జామ్ సెంటర్ కు వచ్చే అభ్యర్థులకు ఆలస్యం కాకూడదని ముందస్తుగా ట్రాఫిక్ ఇన్ స్పెక్టర్ వెంకటయ్య పోలీసు వాహనాన్ని సిద్ధంగా ఉంచారు. దాంతో ఓ అభ్యర్థి పరీక్షా కేంద్రానికి చేరుకునేందుకు ఆలస్యం అవుతుంటడంతో సదరు పోలీసు వాహనంలో పరీక్షా కేంద్రానికి చేర్చారు. ఇన్ స్పెక్టర్ వెంకటయ్య చేసిన ప్రయత్నానికి పలువురు నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.


Similar News