Raj Bhavan: ఘనంగా ప్రీ-క్రిస్మస్ వేడుకలు.. కేక్ కట్ చేసిన గవర్నర్

రాజ్ భవన్‌లో ప్రీ-క్రిస్మస్ వేడుకలు శుక్రవారం ఘనంగా జరిగాయి. తెలంగాణ గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరై కేక్​కట్​చేశారు.

Update: 2024-12-13 15:24 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: రాజ్ భవన్‌లో ప్రీ-క్రిస్మస్ వేడుకలు శుక్రవారం ఘనంగా జరిగాయి. తెలంగాణ గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరై కేక్​కట్​చేశారు. ఈ ఈవెంట్ ద్వారా రాజ్​భవన్‌లో పండుగ వాతావరణం కనిపించింది. రాజ్‌భవన్ పరివార్ సభ్యులు, పిల్లలతో కలిసి గవర్నర్​జిష్టుదేవ్​వర్మ సంబురాల్లో పాల్గొన్నారు. ఈ ప్రీ-క్రిస్మస్ వేడుకల కార్యక్రమంలో హైదరాబాద్‌లోని ప్రఖ్యాత సంగీత బృందం క్రిస్మస్​పాటలు పాడారు. ఈ సందర్భంగా గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ హాజరైన వారితో పాటు రాష్ట్రంలోని క్రిష్టియన్​సోదరులకు తన హృదయపూర్వక క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు.

ప్రతి ఒక్కరూ ప్రేమ, కరుణ సామరస్య విలువలను కలిగి ఉండాలని కోరారు. రాజ్‌భవన్‌ కుటుంబ సభ్యులతో కలిసి ఈ ఆనందకరమైన సందర్భాన్ని జరుపుకోవడం, సఖ్యత పండుగ స్ఫూర్తిని బలోపేతం చేయడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథులుగా రిటైర్డ్ ఐపీఎస్​అధికారిణి అరుణా బహుగుణ, రిటైర్డ్ ఐఏఎస్​అధికారిణి రెబెల్లో, ఐఎఫ్ఎస్ అధికారిణి సోనిబాలా దేవీతో పాటు రాజ్ భవన్ సీనియర్ అధికారులు, సిబ్బంది కూడా ప్రీ-క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్నారు.

Tags:    

Similar News