ఖమ్మం జిల్లాలో ముగ్గురు మంత్రుల గ్రాండ్ ఎంట్రీ
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి వచ్చిన తరువాత ముగ్గురు కీలక నేతలు మంత్రుల హోదాలో తొలిసారి ఖమ్మం జిల్లాకు వచ్చారు.
దిశ, కూసుమంచి: తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి వచ్చిన తరువాత ముగ్గురు కీలక నేతలు మంత్రుల హోదాలో తొలిసారి ఖమ్మం జిల్లాకు వచ్చారు. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావులు ప్రమాణ స్వీకారం తర్వాత తొలిసారి ఖమ్మం రావడంతో కూసుమంచి మండలం నాయకన్ గూడెం వద్దకు అభిమానులు భారీగా చేరుకున్నారు. భారీ గజమాలతో ఘన స్వాగతం పలికారు. అనంతరం మంత్రులు నాయకన్ గూడెం బస్టాండ్ సెంటర్‌లోని గాంధీ, అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేశారు. రోడ్డు మార్గం ద్వారా ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు పువ్వాళ్ల దుర్గ ప్రసాద్, టీపీసీసీ సభ్యులు రాయల నాగేశ్వరావు, మద్దినేని స్వర్ణకుమారి, తుంబూరు దయాకర్ రెడ్డి, తుమ్మల తనయుడు యుగేందర్, రామూర్తి నాయక్, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షులు బొడ్డు బొందయ్య, కూసుమంచి మండల అధ్యక్షుడు మట్టే గురవయ్య, కూసుమంచి ఎంపీటీసీ మాదాసు ఉపేందర్ రావు, ఎర్రబోలు సూర్యానారాయణ రెడ్డి, బజ్జూరి వెంకట్ రెడ్డి, మహమ్మద్ హాఫిజ్ ఉద్దీన్, రూరల్ మండల అధ్యక్షుడు కళ్లెం వెంకట్ రెడ్డి, తిరుమాలాయపాలెం మండల అధ్యక్షుడు బెల్లం శ్రీనివాస్ రావు, ఖమ్మం జిల్లా ముఖ్య నాయకులు కాంగ్రెస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.