Telangana Govt : విద్యుత్ సబ్సిడీలు విడుదల చేసిన ప్రభుత్వం
తెలంగాణ ప్రభుత్వం(Telangana Govt) మరో కీలక నిర్ణయం తీసుకుంది.
దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణ ప్రభుత్వం(Telangana Govt) మరో కీలక నిర్ణయం తీసుకుంది. ట్రాన్స్ కో(Transco) సంస్థలకు విద్యుత్ సబ్సిడీ నిధులు మంజూరు చేసింది. శుక్రవారం రూ.4791 కోట్ల సబ్సిడీ నిధులను ఆయా సంస్థలకు ట్రాన్సఫర్ చేస్తున్నట్టు ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. 2024 నవంబర్ నుండి 2025 మార్చి వరకు ఐదునెలల కాలానికి చెందిన సబ్సిడీలుగా పేర్కొంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీల్లో ముఖ్యమైన 'గృహాజ్యోతి'(GruhaJyothi) పథకంలో జీరో విద్యుత్తు బిల్లు ఒకటి. కాగా లబ్ధిదారులు పొందుతున్న 'జీరో బిల్'(Zero Bill) కు సంబంధించిన డబ్బులు ప్రభుత్వమే ఆయా సంస్థలకు చెల్లిస్తోంది. అలాగే కొన్ని కులాల వారికి, మరికొన్ని పరిశ్రమల విద్యుత్ సబ్సిడీలను కూడా ప్రభుత్వమే భరిస్తోంది. రానున్న ఐదునెలల కాలానికి చెందిన వీటన్నిటి సబ్సిడీలను ప్రభుత్వమే భరిస్తుండగా.. ఆ నిధులు నేడు విడుదల చేసింది.